Home Actor వెంకీ మామ లేటెస్ట్ అప్ డేట్..?

వెంకీ మామ లేటెస్ట్ అప్ డేట్..?

125
0
వెంకీ మామ లేటెస్ట్ అప్ డేట్..? spiceandhra

విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ క్రేజీ మూవీ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివార్లో వేసిన తిర‌నాళ్ల సెట్టింగ్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ తిరునాళ్ల‌లో వెంకీ, చైతు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. వీరితో పాటు ఐదు వంద‌ల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొంటున్న స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని తెలిసింది. ఈ తిరునాళ్ల‌లో మామఅల్లుడు క‌లిసి ఫైట్ కూడా చేయాల్సివ‌స్తుంద‌ట‌. ఈ ఫైట్ ను రామ‌ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం.

వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్ ఫుత్, చైతు స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తున్న ఈ సినిమాని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ లో ఈ క్రేజీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here