Home Actor వెంకీ మామ హీరోయిన్ – సూపర్ ఎగ్జైటింగ్..!

వెంకీ మామ హీరోయిన్ – సూపర్ ఎగ్జైటింగ్..!

120
0


విక్ట‌రీ వెంక‌టేష్ – యువ స‌మ్రాట్ నాగ చైత‌న్యల క్రేజీ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. వెంకీ స‌ర‌స‌న ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయ‌ల్ రాజ్ ఫుత్, నాగ చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల వెంకీ, చైత‌న్య‌ల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

ఇప్ప‌టికే రాశీఖ‌న్నా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. తాజాగా… పాయ‌ల్ రాజ్ ఫుత్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విష‌యాన్ని పాయ‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తూ…కొత్త తెలుగు సినిమా వెంకీ మామ‌..సూప‌ర్ ఎగ్జైటింగ్ అంటూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌తో క‌లిసి పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ప్రేమ‌మ్ సినిమాలో వెంకీ, చైతు క‌లిసి ఒక సీన్ లో క‌నిపిస్తేనే..ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోయారు. అలాంటిది వీరిద్ద‌రు క‌లిసి ఏకంగా సినిమా అంతా క‌నిపిస్తే…ద‌గ్గుబాటి, అక్కినేని అభిమానుల‌కు పండ‌గే. ఈ క్రేజీ మూవీని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here