Home Actor వెంకీ..మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా..?

వెంకీ..మ‌రో మ‌ల్టీస్టార‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారా..?

122
0


విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన మ‌ల్టీస్టార్ మూవీస్ మ‌హేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో గోపాల గోపాల‌, వ‌రుణ్ తేజ్ తో ఎఫ్ 2 సినిమాలు ప్రేక్ష‌కాభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని విజ‌యం సాధించాయి. ఎఫ్ 2 సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డంతో వెంకీతో మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ రూపొందించేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. తాజాగా యువ స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంక‌టేష్..వెంకీ మామ అనే సినిమా చేస్తున్నారు.

బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా త‌ర్వాత మ‌రో మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి ర‌గ‌డ‌, బిందాస్, వీడు గోల్డ్ ఎహే చిత్రాల ద‌ర్శ‌కుడు వీరు పోట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నార‌ని తెలిసింది. ఇందులో వెంకీతో క‌లిసి మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించ‌నున్నార‌ని… అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లో అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here