Home Movie News వెంకీ.. హ్యాపీ బ‌ర్త్ డే..!

వెంకీ.. హ్యాపీ బ‌ర్త్ డే..!

82
0

క‌లియుగ పాండ‌వులు సినిమాతో కెరీర్ ప్రారంభించి వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌క హృద‌యాల్లో సుస్ధిర స్ధానం సంపాదించుకున్నారు విక్ట‌రీ వెంక‌టేష్. ఇటీవ‌ల కాలంలో గురు సినిమాతో విజ‌యంసాధించిన వెంకీ…ఆత‌ర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్న‌ప్ప‌టికీ సెట్స్ పైకి వెళ్ల‌క‌పోవ‌డంతో కెరీర్ లో కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఇక నుంచి అలాంటి గ్యాప్ రాకుండా వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఎఫ్ 2 సినిమాలో న‌టిస్తున్నారు. వ‌రుణ్ తేజ్ తో క‌లిసి న‌టిస్తోన్న ఎఫ్ 2 చిత్రం హ్యాట్రిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ సినిమా నినిర్మిస్తున్నారు.

ఈ రోజు (డిసెంబ‌ర్ 13) వెంక‌టేష్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఎఫ్ 2 టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా ఎఫ్ 2 టీజ‌ర్ చూసాను. సూపర్ ఫ‌న్ అంటూ వెంక‌టేష్  కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌చేసి టీమ్ కి  బెస్ట్ విషేస్ తెలియ‌చేసారు. సంక్రాంతికి ఎఫ్ 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది.  ఈ టీజ‌ర్ చివ‌రిలో చెప్పిన‌ట్టుగా పండ‌గ‌కి గ‌ట్టిగాన‌వ్వించేలా ఉన్నారు. ఈ మూవీ త‌ర్వాత వెంక‌టేష్..నాగ చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మామ అనే సినిమా చేస్తున్నారు.

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంస్ధ‌లు ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ని  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ప్రేమ‌మ్ సినిమాలో వెంకీ – చైతుక‌లిసి కొన్ని నిమిషాలు క‌నిపిస్తేనే ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎంజాయ్ చేసారు. ఇక వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే..ఏ రేంజ్ లో అంచ‌నాలు ఉంటాయో ఊహించుకోవ‌చ్చు. ఆ..అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఉండేలా వెంకీ మామ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇలా… వైవిధ్య‌మైన చిత్రాలుచేస్తూ..విక్ట‌రీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకీ హ్యాపీ బ‌ర్త్ డే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here