Home Actor “వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్. అస‌లు వ‌ర్మ ప్లాన్ ఏంటి..?

“వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్. అస‌లు వ‌ర్మ ప్లాన్ ఏంటి..?

64
0


సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తాజా సంచ‌ల‌నం ల‌క్ష్మీస్ ఎన్టీఆర్. నంద‌మూరి తార‌క రామారావు జీవితంలోకి ల‌క్ష్మీ పార్వ‌తి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన కీల‌క సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ మూవీ ట్రైల‌ర్ యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్స్ లోకి వ‌స్తుందా..? అని అటు అభిమానులు ఇటు ఇండ‌స్ట్రీ జ‌నాలు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. అయితే…ఈ మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్ ను క‌డ‌ప‌లో చేయ‌నున్నామ‌ని వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

కడపలో భారీ బహిరంగ సభలో ఈ వేడుకను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి  ‘‘వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్’’గా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. ఆడియో రిలీజ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వర్మ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఎన్నిక‌ల నేప‌ధ్యంలో ఈ మూవీ రిలీజ్ కాకుండా ఆపాల‌ని తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఎన్నిక‌ల క‌మీష‌న్ ను ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. అయితే…ఇది త‌మ ప‌రిథిలోకి రాద‌ని ఎన్నిక‌ల క‌మీష‌న్ తేల్చేసింది.

ఈ మూవీకి సెన్సార్ ఇంకా కాలేదు. మ‌రి…సెన్సార్ బోర్డ్ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందనేది ఆస‌క్తిగా మారింది. ఈ చిత్రాన్ని ఈ నెల 22న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ…ఆ డేట్ కి రావ‌డం క‌ష్ట‌మే. మ‌రి…సెన్సార్ అడ్డంకుల‌ను అధిగ‌మిస్తే…ఈ నెల‌ 29 న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here