Home Movie News వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లో రానున్న భారీ చిత్రాలు ఇవే..!

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ లో రానున్న భారీ చిత్రాలు ఇవే..!

138
0
DnX3Q3JV4AAe6o_

స్టార్ హీరోల‌తో ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల‌ను నిర్మించి భారీ చిత్రాల నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న స‌క్స‌స్ ఫుల్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్, వైజ‌యంతీ మూవీస్ అధినేత‌ అశ్వ‌నీద‌త్. టాలీవుడ్ కింగ్ నాగార్జున – నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్ లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాట‌ల‌ను ఆ దేవ‌దాసు అక్కినేని పుట్టిన‌రోజైన సెప్టెంబ‌ర్ 20న  దేవ‌దాస్ ఆడియో పార్టీ ఎన్ క‌న్వెన్ష‌న్ లో అభిమానుల మ‌ధ్య గ్రాండ్ గా నిర్వ‌హించ‌నున్న‌ట్టు మెగా మేక‌ర్ అశ్వ‌నీద‌త్ తెలియ‌చేసారు.

దేవ‌దాస్ చిత్రం గురించి అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ…రెండున్నర గంటల సేపు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే సినిమా దేవదాస్. సెప్టెంబర్ 27న మీ ముందుకు వస్తున్నాం. వైజయంతీ మూవీస్ 50 ఏళ్ళుగా నడుస్తోంది. మరో 50 ఏళ్ళు ఈ సంస్థని మా స్వప్న, ప్రియాంక ముందుకు తీసుకెళ్తారు. వందేళ్ళ పాటూ వైజయంతి మూవీస్ సంస్థ ఉండాలన్నది ధ్యేయం అని తెలియ‌చేసారు. త్వ‌ర‌లో నిర్మించ‌నున్న చిత్రాల గురించి తెలియ‌చేస్తూ…దేవ‌దాస్ చిత్రం త‌ర్వాత వైజ‌యంతీ మూవీస్, స్వ‌ప్న సినిమా క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమాని నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.ఆత‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో ఓ మూవీ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో ఓ భారీ చిత్రం, త‌మిళ డైరెక్ట‌ర్ అట్లీతో ఓ సినిమా చేయ‌నున్నాం. ప్ర‌స్తుతం ఈ చిత్రాల‌కు సంబంధించి స్ర్కిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంది అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here