Home Movie Reviews వైఫ్ ఆఫ్ రామ్ రివ్యూ..!

వైఫ్ ఆఫ్ రామ్ రివ్యూ..!

130
0
w/o Ram review

మంచు ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం వైఫ్ ఆఫ్ రామ్. ఈ చిత్రాన్ని రాజ‌మౌళి శిష్యుడు విజ‌య్ యొలకంటి తెర‌కెక్కించారు. ఒక సైకలాజికల్ ఇంటెలిజెంట్ థ్రిల్లర్ గా రూపొందిన వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా పోస్ట‌ర్స్, టీజ‌ర్ & ట్రైల‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉండ‌డంతో వైఫ్ ఆఫ్ రామ్ పై అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. దీనికి తోడు సినీ తార‌లు సైతం వైఫ్ ఆఫ్ రామ్ చిత్రాన్ని ప్ర‌మోట్ చేయ‌డంతో ఈ సినిమా పై మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. ఎన్నో అంచ‌నాలు ఏర్ప‌రుచుకున్న వైఫ్ ఆఫ్ రామ్ చిత్రం ఈరోజు (జులై 20)న రిలీజైంది. మ‌రి…వైఫ్ ఆఫ్ రామ్ అంచ‌నాల‌ను అందుకుందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – దీక్ష (మంచు ల‌క్ష్మి)  అనే యువతి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె భర్త రామ్ (స‌మ్రాట్) హత్యకు గురవుతాడు. పోలీస్ స్టేష‌న్ కి వెళ్లి దీక్ష‌ కంప్లైట్ చేస్తుంది కానీ…పోలీసులు హ‌త్య చేసింది ఎవ‌రో తెలుసుకోలేక‌పోతారు. దీంతో రామ్ ని హ‌త్య చేసింది ఎవ‌రో త‌నే తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఆ రహస్యాన్ని ఛేదించే క్రమంలో దీక్ష‌  ఎదుర్కొన్న వింత, భయానక పరిస్థితులేంటి. చివ‌రికి రామ్ ఎలా చ‌నిపోయాడు.? రామ్ ని చంపాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంది. చివ‌రికి దీక్ష ఏం చేసింది అనేది మిగిలిన‌ కథ.

ప్ల‌స్ పాయింట్స్

మంచు ల‌క్ష్మి న‌ట‌న‌

డైరెక్ట‌ర్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌

నిర్మాణ విలువ‌లు

ర‌ఘు దీక్షిత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్

సామ‌ల భాస్క‌ర్ సినిమ‌టోగ్ర‌ఫీ

విశ్లేష‌ణ – త‌న భ‌ర్త‌ను హ‌త్య చేసింది ఎవ‌రో తెలుసుకునే దీక్ష పాత్ర‌లో మంచు ల‌క్ష్మి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసారు. త‌న న‌ట‌న‌తో సినిమా ప్రారంభం నుంచి ఆడియ‌న్స్ ఇన్ వాల్వ్ అయి చూసేలా చేసి మ‌రోసారి మంచు ల‌క్ష్మి అద్భుత‌మైన న‌టి అనిపించుకున్నారు. ఓ వైపు బిడ్డ‌ను కోల్పోయి, మ‌రో వైపు భ‌ర్తను కోల్పోయిన‌ బరువైన పాత్ర‌లో అద్భుత అభిన‌యం క‌న‌బ‌రిచారు కాబ‌ట్టే… అది సినిమా అని తెలిసినా..ఆడియ‌న్స్ అయ్యో పాపం ఆమెకు ఎంత క‌ష్టం వ‌చ్చింది అని ఫీల‌వుతున్నారు.

ఇక డైరెక్ట‌ర్ గురించి చెప్పాలంటే..ఏ డైరెక్ట‌ర్ అయినా తొలి చిత్రానికి క‌మ‌ర్షియ‌ల్ స్టోరీ ఎంచుకుంటారు కానీ…రోటీన్ కి భిన్నంగా ఆలోచిస్తాడు కాబ‌ట్టే డైరెక్ట‌ర్ విజ‌య్ ఇలాంటి వైవిధ్య‌మైన క‌థను ఎంచుకున్నాడు. ఆరు పాట‌లు, మూడు ఫైట్లు..ఇలా రోటీన్ గా కాకుండా ఆడియ‌న్స్ కి కొత్త ఫీల్ క‌లిగించాలని డైరెక్ట‌ర్ చేసిన ప్ర‌య‌త్నం ఎంతైనా అభినంద‌నీయం. దీక్షకు  సాయపడే పోలీస్ కానిస్టేబుల్ చారిగా ప్రియదర్శి న‌ట‌న బాగుంది. నెగటివ్ షేడ్ ఉన్న రాజ్ పాత్రలో ఆదర్శ్ నటించగా… దీక్ష భర్త రామ్‌గా స‌మ్రాట్ పాత్ర నిడివి తక్కువే అయినా.. సినిమాలో కీల‌క పాత్ర పోషించాడు. అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర బాగుంది.

సినిమాని ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఇంట్ర‌స్టింగ్ గా ఏమాత్రం బోర్ లేకుండా న‌డిపించ‌డంలో డైరెక్ట‌ర్ విజ‌య్ స‌క్స‌స్ అయ్యాడు. ఇలాంటి థ్రిల్ల‌ర్ మూవీస్ కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ర‌ఘు దీక్షిత్ అందించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్,  అలాగే సామల భాస్కర్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి.  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, మంచు ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ‌లు ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. అది ప్ర‌తి ఫేమ్ లో క‌నిపిస్తుంది. టోట‌ల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా..థ్రిల్ల‌ర్ మూవీస్ ఇష్ట‌ప‌డే వారికి వైఫ్ ఆఫ్ రామ్ బాగా క‌నెక్ట్ అవుతుంది.

రేటింగ్ 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here