Home News వైరిచ‌ర్ల కిషోర్ చంద్ర‌దేవ్ కాంగ్రెస్ కి రాజీనామా – తెలుగుదేశంలో చేరిక‌.!

వైరిచ‌ర్ల కిషోర్ చంద్ర‌దేవ్ కాంగ్రెస్ కి రాజీనామా – తెలుగుదేశంలో చేరిక‌.!

102
0
Shri V. Kishore Chandra Deo, Minister for Panchayati Raj assuming the charge of office in the Ministry of Panchayati Raj, in New Delhi on July 19, 2011.

విజయనగరం జిల్లా రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేసే రాజవంశాలు పూసపాటి, బొబ్బిలి, శత్రుచర్లతో పాటు  ఇప్పుడు వైరిచర్ల వంశం కూడా ఒకే పార్టీలో ఉన్నట్లయింది. ఒకప్పుడు  ఉప్పు నిప్పు గా ఉన్న శత్రుచర్ల, వైరిచర్ల ఇప్పుడు  పాత తగాదాలను వదిలి కొత్త స్నేహ రాగం ఆలపిస్తున్నాయి. ఈ  రెండు వంశాల మధ్య రాజకీయ శత్రుత్వం ఈనాటిది కాదు. వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్,  శత్రుచర్ల విజయరామరాజు ఒకే పార్టీ కాంగ్రెస్లో ఉన్నా ఇద్దరికీ సరిపడేది కాదు.  ఇది పార్టీకి చేటు చేస్తుందని గుర్తించిన పీవీ నరసింహారావు మధ్యేమార్గంగా కిషోర్ ను ఢిల్లీ స్థాయి రాజకీయాలకు పంపగా విజయరామరాజును  రాష్ట్ర రాజకీయాలకు పరిమితం చేశారు. చాన్నాళ్ల పాటు అలాగే జరిగింది.  2014 ఎన్నికల సమయంలో శత్రుచర్ల కాంగ్రెస్ను వీడి తెలుగుదేశంలో చేరారు.ఇప్పుడు కిషోర్ కూడా అందులోనే చేరారు.

కిషోర్ చంద్రదేవ్ కి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గిరిజన ప్రాంతాల్లో మంచి  పట్టు ఉంది. ఢిల్లీ స్థాయిలో వ్యవహారాలను చక్క పెట్టగల  నేర్పు ఉంది. కానీ.. స్ధానిక ప్రజల్ని ఎప్పుడూ పట్టించుకోకుండా వ్యవహరించారు. కేవలం ప్రజల్ని ఓటు యంత్రాలుగా పరిగణిస్తారు.  ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆయనను దరి చేర్చుకున్నారు.  ఒకానొక దశలో కిషోర్ కమ్యూనిస్టు నాయకులతో కూడా మంతనాలు జరిపారు. కానీ తెలుగుదేశం అప్రమత్తం కావడంతో కిషోర్ కూడా ఇటు వైపు మొగ్గు చూపించారు. అరకు లోక్ సభ  స్థానానికి మంచి అభ్యర్థి దొరికినట్లయింది.  ఈ నియోజకవర్గ పరిధిలో కిషోర్ కు మంచి అనుచరగణం ఉంది. గత ఐదేళ్లుగా వీరంతా స్త‌బ్ధుగా ఉన్నారు.  ఇప్పుడు మీరు అందర్నీ తెలుగుదేశంలోకి తీసుకురావడానికి కిషోర్ ప్రయత్నాలు ప్రారంభించారు.

సొంత అసెంబ్లీ నియోజకవర్గం రూపంలో ఎమ్మెల్యేగా కోడలు పుష్ప శ్రీవాణి ఉన్నారు. ఈమె వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున పోటీ చేయబోతున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఆమె అభివృద్ధి పనుల ద్వారా నియోజకవర్గంలో పట్టు పంచుకున్నారు. ఇక్కడ టీడీపీ బలం పెంచడానికి కిషోర్ చంద్రదేవ్ పాత నాయకులందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.  కాంగ్రెస్లో 42 సంవత్సరాల పాటు రాజకీయం చేసిన ఆయన సాలూరు, పార్వతీపురం అసెంబ్లీ  నియోజకవర్గాల్లో బాగా ప్రభావం చూపించగలరు. టీడీపీలో చేరిన వెంటనే శత్రుచర్ల తో  మంతనాలు జరిపేందుకు కిషోర్ ఆయనను ఆహ్వానించారు. అటు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గిరిజన ప్రాంతాల్లో గట్టి పట్టు ఉన్న వైసీపీని ఎదుర్కొనడానికి ఈ ఇద్దరు రాజులు ఎలాంటి రాజకీయం నడుపుతారో చూడాల్సిందే అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here