Home Actor వైష్ట‌వ్ తేజ్ స‌ర‌స‌న కొత్త అమ్మాయి కృతి శెట్టి. ఇంత‌కీ ప్రారంభం ఎప్పుడు..?

వైష్ట‌వ్ తేజ్ స‌ర‌స‌న కొత్త అమ్మాయి కృతి శెట్టి. ఇంత‌కీ ప్రారంభం ఎప్పుడు..?

109
0

సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక విభిన్నమైన ప్రేమకథాచిత్రం రూపొందనుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమ‌ర్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ సినిమాకి ఉప్పెన అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టీమ్ హీరోయిన్ స్టిల్ ను రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసారు. సరిగమ అనే కన్నడ సినిమా ద్వారా వెండితెరకి పరిచయమైన ఈ అమ్మాయి, ఆ తరువాత తమిళ సినిమాల్లో న‌టిస్తోంది. ఉప్పెన చిత్రంతో ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తుండగా, విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here