Home Actor వైసీపీ, టీడీపీవాళ్లు రాజకీయాలను జూదంలా మార్చేశారు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

వైసీపీ, టీడీపీవాళ్లు రాజకీయాలను జూదంలా మార్చేశారు – ప‌వ‌న్ క‌ళ్యాణ్

77
0


రాజ‌కీయాలు అంటే వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం నాయ‌కులకు బెట్టింగ్ అయిపోయాయ‌ని,  జెండా ఏ వైపు ఎగురుతాది అనే వాటి పైన కూడా వీళ్లు బెట్టింగులు ఆడుతారని జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శించారు. రెండు పార్టీల నాయ‌కులు బెట్టింగుల కోసం క‌ల‌లు కంటుంటే జ‌న‌సేన నాయ‌కులు మాత్రం యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి క‌ల్పించాల‌ని, స్థానిక స‌మ‌స్య‌ల పై పోరాటం చేయాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని తెలిపారు.  2019లో నెల్లూరు సిటీ సీటు గెలిచి రాజ‌కీయాల్లో మార్పు సింహ‌పురి నుంచి మొద‌లు పెడ‌దామ‌ని పిలుపు నిచ్చారు.  ఎన్నిక‌ల శంఖారావంలో భాగంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్  నెల్లూరులో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు.

ఈ వేదిక నుంచి  ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. “నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ నా అభిమాని అని చెబుతాడు. రెండుమూడు సార్లు క‌లిశాడు కూడా. అయ‌న‌కు నేనొక‌టే చెప్పాను నా అభిమానివి అని చెప్పాలంటే ముందు బెట్టింగులు మానేసేయ్ అని చెప్పాను. నెల్లూరులో ఉన్న వైసీపీ నాయ‌కులు బెట్టింగ్ ఎక్స్ ప‌ర్ట్స్ లా త‌యార‌య్యారు. మీకెందుకు రాజ‌కీయాలు.. క్లబ్బుల్లో కూర్చుని పేకాట, బెట్టింగులు ఆడుకోండి. ఎమ్మెల్యే అయి ఉండి పోలీసుల చొక్కాలు ప‌ట్టుకుని రౌడీయిజం చేస్తారా..?. మీలాంటి వారు రేపు అధికారంలోకి వ‌స్తే ఊరుకుంటారా..? ఇంకెంత రెచ్చిపోతారో. అయినా  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప‌వ‌ర్ లేదు. వాళ్ల ఫ్యాన్ తిర‌గాలంటే మ‌న ద‌గ్గ‌ర నుండే ప‌వ‌ర్ వెళ్లాలి. స్విచ్  కూడా మ‌న ద‌గ్గ‌రే ఉంది.

 నారాయణ గారు.. లోకేష్ కి ట్యూషన్ చెప్పుకోండి.

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆయ‌న మంత్రి నారాయ‌ణ కావ‌చ్చు ఏమో.. నాకు మాత్రం ఆయ‌న మాములు నారాయ‌ణే. రొట్టెల పండుగ‌కు నెల్లూరు వ‌స్తే న‌న్ను అడ్డుకోవాల‌ని చూశారు. ఇది మా అమ్మ సొంత ఊరు. ఫతేఖాన్ పేట, మూలాపేట, టెక్కేమిట్టా ప్రతి దగ్గర నాకు కావాల్సిన మనుషులు ఉన్నారు. చిన్న చిన్న ట్యూష‌న్లు చెప్పుకొనే నారాయ‌ణ గారికి ఇన్ని విద్యాసంస్థలు, మెడికల్ కాలేజీలు ఎలా పెట్టగలిగారు. ఆయ‌న అవినీతిని వ‌దిలి పెట్టేది లేదు. ప్ర‌జా క్షేత్రంలో నిల‌బెట్టి ఎండ‌గ‌డ‌తాం. మంత్రి నారాయ‌ణ గారు మీరు జిల్లాకు చేసిన సేవ‌లు చాలు. వెళ్లి చంద్ర‌బాబు గారి అబ్బాయి లోకేశ్ బాబుకు ట్యూష‌న్ చెప్పుకోండి. మావాళ్లు వ‌చ్చారు.. ఇక్క‌డ స‌మ‌స్య‌లు వాళ్లు ప‌ట్టించుకుంటారు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here