Home Actor వై.ఎస్.జ‌గ‌న్ ని క‌లిసి డైరెక్ట‌ర్ మ‌హి. యాత్ర పై జ‌గ‌న్ రియాక్ష‌న్ ఏంటి..?

వై.ఎస్.జ‌గ‌న్ ని క‌లిసి డైరెక్ట‌ర్ మ‌హి. యాత్ర పై జ‌గ‌న్ రియాక్ష‌న్ ఏంటి..?

78
0

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర. ఆనందో బ్ర‌హ్మ ఫేమ్ మ‌హి వి రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మ‌ల‌యాళ అగ్ర హీరో మ‌మ్ముట్టి వై.ఎస్ పాత్ర‌ను పోషించిన యాత్ర సినిమాకి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్ట‌ర్ మ‌హి, చిత్ర నిర్మాత విజయ్ చిల్లా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసారు. ఈ భేటీ అనంతరం దర్శకుడు మ‌హి మీడియాతో మాట్లాడారు. సినిమాకు వచ్చిన హిట్‌ టాక్‌ గురించి వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారని, చిత్రం పై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల జ‌గ‌న్ సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. వై.ఎస్ పై సినిమా తీయ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. యాత్ర సినిమా చూసి ఎక్క‌డెక్క‌డి నుంచో జనాలు ఫోన్‌ చేసి చిత్రం పై ఫీడ్ బ్యాక్‌ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ ని కుటుంబ స‌మేతంగా సినిమా చూడ‌మ‌ని డైరెక్ట‌ర్ మ‌హి, చిత్ర నిర్మాత విజ‌య్ కోరార‌ని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here