Home Actor వ‌ర్మ మ‌రో వివాద‌స్ప‌ద చిత్రం టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..!

వ‌ర్మ మ‌రో వివాద‌స్ప‌ద చిత్రం టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు..!

154
0

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా తెర‌కెక్కించ‌డం…ఈ మూవీ తెలంగాణలో విడుద‌ల కావ‌డం…ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విడుద‌ల కాక‌పోవ‌డం తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ల‌క్ష్మీ ఎన్టీఆర్ చిత్రాన్ని మాత్రం కావాలనే అడ్డుపడ్డారని ఆరోపించారు వ‌ర్మ‌. విజయవాడలో ప్రెస్ మీట్ పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తే వేధించి.. బలవంతంగా తిరిగి హైదరాబాద్ పంపించారని వ‌ర్మ మండిపడ్డారు.

ఆత‌ర్వాత వ‌ర్మ హైద‌రాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి చంద్ర‌బాబు నాయుడు పై విమ‌ర్శ‌లు చేయ‌డం..సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఇదిలా ఉంటే.. నిజాన్ని దాచొచ్చు.. కానీ ఎప్పటికైనా బయటపడుతుంది. ఏపీలో ప్రజలు ఈ నెల 31న నిజాలేంటో చూస్తారన్నారు.  విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ చివరి రోజుల్లో ఏం జరిగిందో తెలియజేయడానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశామన్నారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో నిజాలు చెప్పేందుకు ప్రయత్నించా.. అది కొంత మందికి నచ్చలేదు.. అందుకే సినిమా విడుదలను అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో పడిన నరకయాతనను.. జగన్నాటకం ఆడిన వారి గురించి అందిరికి తెలియజేయాలని ప్రయత్నించానన్నరు వర్మ. 25 ఏళ్ల తర్వాత కూడా ఆయన ఫోటో, పేరు చెప్పుకొని ప్రజల దగ్గరకు వెళుతున్నారని.. అంత కంటే వెన్నుపోటు మరొకటి లేదన్నారు.

ఇదిలా ఉంటే…ఈ ప్రెస్ మీట్ లో మ‌రో వివాద‌స్ప‌ద చిత్రాన్ని ఎనౌన్స్ చేసారు. ఈ మూవీ టైటిల్ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమా తీయబోతున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ టైటిల్ విన‌డానికే అంద‌మైన టైటిల్.  వాళ్ల మధ్య ఉన్న చిచ్చులు చూసి సినిమా తీస్తాను కానీ…నా సినిమా వ‌ల్ల వారి మ‌ధ్య చిచ్చులు రావు. రౌడీయిజం నేను స్టార్ట్ చేయ‌లేదు. ఫ్యాక్ష‌న్ నేను స్టార్ట్ చేయ‌లేదు. ఆల్రెడీ ఉన్న‌దే నేను సినిమాల్లో చూపిస్తుంటాను. విజయవాడ రాగానే బోయపాటి సినిమాలాగా సుమోలు తిరుగుతున్నాయి. కడపలో చూసిన రెడ్లంతా ఇక్కడే ఉన్నారు. అందుకే నాకు ఒక ఇన్సిపిరేషన్ వచ్చింది.. ఇప్పుడు కథ రాయడం మొదలు పెడతా అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here