Home Actor వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం – కేసీఆర్ బ‌యోపిక్..!

వ‌ర్మ మ‌రో సంచ‌ల‌నం – కేసీఆర్ బ‌యోపిక్..!

125
0

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తో సినిమా తీయ‌డం..ఆ సినిమా వివాద‌స్ప‌దం అవ్వ‌డం తెలిసిందే. తాజాగా కేసీఆర్ బ‌యోపిక్ అంటూ మ‌రో సంచ‌ల‌నానికి రెడీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సినిమా తీస్తానని చాలా రోజుల క్రితం ప్రకటించిన వర్మ అన్నట్లుగానే సినిమా టైటిల్ ను ఈరోజు ప్రకటించారు. కేసీఆర్ టైగర్.. ది అగ్రెసివ్ గాంధీ అని ఈ సినిమాకు టైటిల్ పెట్టినట్లు వర్మ ట్విట్టర్ ద్వారా తెలియ‌చేసారు.

ఈ టైటిల్ కు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే లైన్ ను జత చేశారు. కాగా, ఈ సినిమాలో కేసీఆర్ గా ఎవ‌రు న‌టిస్తారు..? ఎప్పుడు ఈ సినిమాని ప్రారంభిస్తారు అనేది మాత్రం చెప్ప‌లేదు.  త్వ‌ర‌లోనే మరిన్ని విషయాలను వెల్లడించే అవకాశముందని భావిస్తున్నారు. వ‌ర్మ‌కు వివాదం కావాలి. లేదంటే…ఆయ‌నే వివాదాన్ని సృష్టిస్తాడు. మ‌రి…ఈ కేసీఆర్ బ‌యోపిక్ ఎలాంటి వివాదాన్ని సృష్టిస్తుందో చూడాలి..!  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here