Home Actor వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి. జ‌న‌సేన కార్యక‌ర్తల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపు.

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి. జ‌న‌సేన కార్యక‌ర్తల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపు.

87
0
వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి. జ‌న‌సేన కార్యక‌ర్తల‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపు. spiceandhra

గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు  జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్  పిలుపునిచ్చారు. దేవీప‌ట్నం ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్ర‌భుత్వం స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా ముంపు బాధితుల‌కు ఎవ‌రి స్థాయి మేర‌కు వారు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు.

పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్ధేశం చేయ‌డం, భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ర‌చ‌న‌, రెండు నెల‌ల త‌ర్వాత కొత్త ప్ర‌భుత్వ ప‌ని తీరు ఎలా వుంది అనే అంశాలు ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాన అజెండాలుగా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాలు హుందాగా ఉండాల‌ని జ‌న‌సేన పార్టీ కోరుకుంటుంద‌నీ, పార్టీ శాస‌న‌స‌భ్యులు రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ స‌భ‌లో అందుకు త‌గ్గ‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. జనసేన పార్టీ ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లు ఉండదన్నారు. వైసీపీ, టీడీపీల‌పై కూడా స‌భ‌ను హుందాగా న‌డ‌పాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు. అంత‌కు ముందు రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టులో శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల నుంచి ఘ‌న‌ స్వాగ‌తం ల‌భించింది.

శ్రీ పవన్ కల్యాణ్ వెంట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పి.రామ్మోహన్ రావు ఉన్నారు. పార్టీ శాస‌న‌స‌భ్యులు శ్రీ రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌, ప్యాక్ స‌భ్యులు శ్రీ కందుల దుర్గేష్‌, శ్రీ బి.నాయకర్ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన శాస‌న‌స‌భ బ‌రిలోకి దిగిన శ్రీ పితాని బాల‌కృష్ణ‌, శ్రీ అత్తి స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ అటిక‌ల ర‌మ్య‌శ్రీ, శ్రీ పంతం నానాజీ, శ్రీ శెట్టిబ‌త్తుల రాజ‌బాబు, శ్రీ తుమ్మల బాబు, శ్రీ తమ్మయ్య దొర, శ్రీమతి పాముల రాజేశ్వరి, శ్రీమతి మాకినీడు శేషుకుమారి, శ్రీ పొలిశెట్టి చంద్రశేఖర్, శ్రీ పాటంశెట్టి సూర్యచంద్ర, శ్రీ బండారు శ్రీనివాస్ త‌దిత‌రులు స్వాగ‌తం ప‌లికిన వారిలో ఉన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here