Home Movie News శర్వానంద్, సాయి పల్లవి ల పడి పడి లేచే మనసు టీజ‌ర్ సెన్సేష‌న్..!

శర్వానంద్, సాయి పల్లవి ల పడి పడి లేచే మనసు టీజ‌ర్ సెన్సేష‌న్..!

39
0

శర్వానంద్, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న క్రేజీ చిత్రం ‘పడి పడి లేచే మనసు’.. ఇటీవలే టీజర్ విడుదల అవగా 3.5 మిలియన్ వ్యూస్ తో ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. కాగా సినిమాకు సంబంధించిన మొదటి పాట వివరాలను చిత్ర  నిర్మాతలు ప్రకటించారు.. నవంబర్ 12న సినిమా యొక్క టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.

మురళి శర్మ, సునీల్ లు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.. హైదరాబాద్, కోల్ కతా, నేపాల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశలో ఉంది.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సినిమాని నిర్మిస్తుండగా డిసెంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, అభిషేక్ మహర్షి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు: హను రాఘవపూడి నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ : జాయ్ కే, ఎడిటర్: ఎ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ : భూపేష్ ఆర్ భూపతి, PRO: వంశీ-శేఖర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here