Home Actor శర్వానంద్, సుధీర్ వర్మల‌  ‘రణరంగం’  లోని ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’  పాట విడుదల

శర్వానంద్, సుధీర్ వర్మల‌  ‘రణరంగం’  లోని ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’  పాట విడుదల

59
0
శర్వానంద్, సుధీర్ వర్మల‌ 'రణరంగం' లోని 'పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్' పాట విడుదల spiceandhra

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన మూడవ గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పల్లవి గల ఈ  గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్  లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కధా పరంగా శర్వానంద్, కాజల్ అగర్వాల్ ల మధ్య  చిత్రీకరించిన ఈ పాట క్లాస్,మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

గాయని  నిఖిత గాంధీ గళం ఈ పాటకు మరింత కొత్త దనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15 , 2019   న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here