Home Actor శర్వానంద్ హీరోగా `శ్రీకారం`ప్రారంభం.

శర్వానంద్ హీరోగా `శ్రీకారం`ప్రారంభం.

70
0
శర్వానంద్ హీరోగా `శ్రీకారం`ప్రారంభం. spiceandhra

విభిన్న క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ.. తన ఇమేజిని పెంచుకుంటూ ముందుకు సాగుతున్నయువ‌ హీరో శర్వానంద్. ఇక ప్రస్తుతం తమిళ చిత్రం 96 రీమేక్, అలానే రణరంగం అనే రెండు చిత్రాల్లో నటిస్తున్న శర్వానంద్, మరొక నూతన చిత్రం `శ్రీకారం` సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించే ఈ చిత్రంతో కిశోర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

చిత్ర ముహూర్త‌పు స‌న్నివేశానికి దర్శకులు సుకుమార్ క్లాప్ ని కొట్టగా, ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ చిత్రానికి మాటల రచయితగా పని చేస్తున్న బుర్రా సాయిమాధవ్, చిత్ర స్క్రిప్ట్ ని తన చేతుల మీదుగా దర్శకుడికి అందచేయడం జ‌రిగింది.  మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  ఆగష్టులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కానుకగా విడుద‌ల చేసేలా  ప్లాన్స్ జ‌రుగుతున్నాయి.

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  కిశోర్ రెడ్డి, బ్యాన‌ర్‌: 14 రీల్స్ ప్లస్‌, నిర్మాత‌లు:  రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట‌, సంగీతం:  మిక్కి జె.మేయ‌ర్‌, సినిమాటోగ్ర‌పీ:  యువ‌రాజ్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్:  అవినాశ్ కొల్ల‌, డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్ బుర్రా, ఎడిట‌ర్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  హ‌రీశ్ క‌ట్టా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here