Home Actor శివాజీరాజాకు “మా” వార్నింగ్..!

శివాజీరాజాకు “మా” వార్నింగ్..!

106
0

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో శివాజీరాజా, న‌రేష్ మ‌ధ్య మాట‌ల య‌ద్ధం జ‌ర‌గ‌డం..వివాద‌స్ప‌దం అవ్వ‌డం తెలిసిందే. తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు న‌రేష్, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జీవిత అసోషియేన్ గురించి శివాజీరాజా కామెంట్స్ గురించి..సోష‌ల్ మీడియా ద్వారా త‌మ స్పంద‌న‌ను తెలియ‌చేసారు. ముందుగా న‌రేష్ మాట్లాడుతూ…మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అద్భుతమైన సోషల్ ఆర్గనైజేషన్. ఎంతో మంది అధ్యక్షులు సమక్షంలో ఎన్నో మంచి పనులు జరిగాయి. ఇందులో ఒక మార్పు కావాలని కోరుకున్నప్పుడు నన్ను ప్రెసిడెంట్‌గా జీవిత గారిని జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు మేం ఆరోగ్యకరమైన వాతావరణంలో రెండేళ్లు మంచి పనులు చేయాలని నిర్ణయించాం.

దీనిలో భాగంగా హెల్ప్ లైన్, పెన్షన్ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తెలంగాణ ప్రభుత్వం సాయం చేస్తుంది. త్వరలో ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదిస్తాం. అయితే ‘మా’ అనేది ఒక కుటుంబం లాంటిది. ఏవైనా ఉంటే తమలో తాము మాట్లాడుకోవాలి. కాని.. మీడియా లీక్స్ అనేవి నాకు పర్సనల్‌గా బాధ కలిగిస్తోంది. ఎందుకంటే అందరం మంచి స్థాయిలో ఉన్నవాళ్లం. ఈ సందర్భంలో మీడియా లీక్స్ ఇవ్వడం మంచిది కాదు. ఇక పై మీడియాకి లీక్స్ ఇచ్చే వాళ్ల పై యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం.

ఎందుకంటే మొన్న నాగబాబు గారి పై మిత్రుడు శివాజీరాజా చేసిన కామెంట్స్ బాధ కలిగించాయి. ఒకప్పుడు నాగబాబు ప్రెసిడెంట్.. తరువాత మురళీ మోహన్, శివాజీరాజా చేశారు. అయితే నాగబాబు పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దారుణం. ఆయనకి అంగవైకల్యం, నడవలేకపోతున్నారంటూ కామెంట్స్ చేయడం ఆర్టిస్ట్ ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడమే. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఎంపీగా కూడా పోటీ చేశారు. ఇక నాగబాబు ‘మా’కి ఏంచేశారు అంటూ శివాజీ రాజా కామెంట్స్ చేశారు. ఆయన ప్రెసిడెంట్‌గా చేసినప్పుడు చాలా మందికి పెన్షన్‌తో పాటు సభ్యత్వాలు ఇప్పించారు. చేతనైన సాయం చేశారు ‘మా’లో చాలా మంచి పనులుచేశారు. కాబట్టి ఒక అధ్యక్షుడిగా పనిచేసి వ్యక్తిని ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేస్తూ పబ్లిక్‌లో పెట్టొదనేది నా అభిప్రాయం.

అలాగే నాగబాబు పిల్లికి భిక్షం పెట్టలేదన్నారు. కాని ఆయన పోటీలో లేకపోయినప్పటికీ సొంతంగా రూ. 6 లక్షల రూపాయిలు డొనేట్ చేశారు. ఇవన్నీ రికార్డ్స్‌లో ఉన్నాయి. నాగబాబు మనస్పూర్తిగా మాకు సహకరించారు. ఇప్పటికైనా అందరం కలిసి పనిచేద్దాం. ఎవర్నీ వ్యక్తిగతంగా దూషించవద్దు. వివాదాల్లోకి ‘మా’ని లాగొద్దని నా సలహా. ఫైనల్‌గా శివాజీరాజా.. నాగబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా అని అన్నారు నరేష్.

జీవిత మాట్లాడుతూ…200% న‌రేష్ గారితో ఏకీభ‌విస్తున్నాను. శివాజీరాజా గారు..నాగ‌బాబు గారి గురించి మాట్లాడిన‌ప్పుడు మా గురించి కూడా మాట్లాడాడారు.ఆర్టిస్టుల‌కు చేత‌నైన స‌హాయం చేద్దాం అని మంచి సంక‌ల్పంతో అంద‌రం వ‌చ్చాం. ఒక‌రినొక‌రు దూషించుకోవ‌ద్దు. మ‌నం మంచి చేద్దాం. మంచే మ‌ట్లాడుకుందాం. మ‌న‌ల్ని మ‌నం కించ‌ప‌రుచుకోవ‌ద్దు… అని ఎన్నో ర‌కాలుగా మాట్లాడుకున్న త‌ర్వాత కూడా ఇలాంటివి ఒక‌టి రెండు జ‌ర‌గ‌డం చాలా ఇబ్బందిక‌రంగా ఉంది. మాకు ఉన్న ఈ రెండు సంవ‌త్స‌రాల్లో మంచి చేయాల‌నుకుంటున్నాం. అంద‌రం క‌లిసి మంచి చేద్దాం. ఎదుట‌వారి గురించి చెడు చెప్ప‌డం మానేద్దాం అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here