Home Actor శిష్యుడు పూరి స‌క్స‌స్ బాగా ఎంజాయ్ చేస్తోన్న వ‌ర్మ‌..!

శిష్యుడు పూరి స‌క్స‌స్ బాగా ఎంజాయ్ చేస్తోన్న వ‌ర్మ‌..!

43
0
శిష్యుడు పూరి స‌క్స‌స్ బాగా ఎంజాయ్ చేస్తోన్న వ‌ర్మ‌..! spiceandhra

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ లేటెస్ట్ సెన్సేష‌న్ ఇస్మార్ట్ శంక‌ర్.  రామ్, నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేష్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన ఇస్మార్ట్ శంక‌ర్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అన్ని ఏరియాల్లో హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్స్ తో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తూ బ్లాక్ బ‌ష్ట‌ర్ దిశ‌గా ప‌రుగులు తీస్తుంది. పూరి జ‌గ‌న్నాథ్ కి టెంప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన స‌క్స‌స్ రాలేదు.

దీంతో ఈ స‌క్స‌స్ ని పూరి టీమ్ బాగా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ అయితే…. శిష్యుడు పూరికి స‌క్స‌స్ రావ‌డంతో ఆనందానికి అవ‌ధులు లేవు అన్న‌ట్గుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇస్మార్ట్ టీమ్ వ‌ర్మ‌కి పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో వ‌ర్మ త‌న శిష్యుడు పూరీ జ‌గ‌న్నాథ్ కి గ‌ట్టిగా ముద్దిచ్చాడు. ఈ ఫోటోను ఇస్మార్ట్ శంక‌ర్ లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషించిన స‌త్య‌దేవ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

ఇక ఈరోజు హైద‌రాబాద్ శ్రీరాములు ధియేట‌ర్ కి రామ్ గోపాల్ వ‌ర్మ‌, ఆర్ఎక్స్ 100 అజ‌య్ భూప‌తి, ఇస్మార్ట్ శంక‌ర్ టీమ్ తో క‌లిసి వెళ్లారు. అక్క‌డ కూడా ఇస్మార్ట్ టీమ్ పూరి, ఛార్మి ల‌తో క‌లిసి వ‌ర్మ స‌క్స‌స్ ని సెల‌బ్రేట్ చేసుకున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here