Home Movie Reviews శైల‌జారెడ్డి అల్లుడు రివ్యూ..!

శైల‌జారెడ్డి అల్లుడు రివ్యూ..!

131
0
Dm8QPGwX0AAduvc

అక్కినేని నాగ‌చైత‌న్య – మారుతి కాంబినేష‌న్లో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ శైల‌జారెడ్డి అల్లుడు. ఈ చిత్రంలో నాగ‌చైత‌న్య‌కు అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించ‌డం..ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డం..దీనికి తోడు వినాయ‌క చ‌వితికి ఈ సినిమా రిలీజ్ కావ‌డంతో..అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చైత‌న్య ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తోన్న బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాతో వ‌స్తుంద‌ని అభిమానులు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఈరోజు (సెప్టెంబ‌ర్ 13) శైల‌జారెడ్డి అల్లుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. మ‌రి..శైల‌జారెడ్డి అల్లుడు అంచ‌నాల‌ను అందుకుందా….? లేదా…? అనేది చెప్పాలంటే ముందు క‌థ చెప్పాల్సిందే.

క‌థ – చైత‌న్య (నాగ చైత‌న్య‌) తండ్రి (ముర‌ళీశ‌ర్మ‌) బిజినెస్ చూసుకుంటుంటాడు. తండ్రికి ఇగో ఉన్నా.. కొడుకు మాత్రం సాఫ్ట్ గా ఉంటాడు. ప్ర‌తిదీ పాజిటివ్ గా తీసుకుంటుంటాడు. అను (అను ఇమ్మాన్యుయేల్) ఈమెకి కూడా ఇగో బాగా ఎక్కువ‌. ఎంత ఎక్కువంటే ఇగో వ‌ల్ల త‌న క‌న్న‌త‌ల్లి (శైల‌జారెడ్డి)తోనే 5 సంవ‌త్స‌రాలు మాట్లాడ‌డం మానేసంత‌. ఇంత ఇగో ఉన్న అనుని చైత‌న్య ప్రేమిస్తాడు. ఆత‌ర్వాత త‌న పాజిటివ్ అటిట్యూడ్ తో ప్రేమించేలా చేసుకుంటాడు. అయితే..ఇగో ప్రాబ్ల‌మ్ వ‌ల్ల చైతు తండ్రి, చైతు, అనుల ఎంగేజ్ మెంట్ శైల‌జారెడ్డికి చెప్ప‌కుండా చేస్తాడు. త‌న మాటే శాస‌నలా భావించే శైల‌జారెడ్డి ఈ విష‌యం తెలిసి ఎలా రియాక్ట్ అయ్యింది…? ఆత‌ర్వాత ఏం జ‌రిగింది..? ఇగో ఉన్న త‌ల్లి,కూతురు మ‌ధ్య చైత‌న్య ఎలా స‌త‌మ‌త‌మ‌య్యాడు..? త‌ల్లికూత‌రును క‌ల‌ప‌డానికి చైతు ఏం చేసాడు..? అనేదే మిగిలిన క‌థ‌

ప్ల‌స్ పాయింట్స్
చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌
పృథ్వీ, వెన్నెల కిషోర్ కామెడీ
హాలో బ్ర‌ద‌ర్ ఆర్ ఆర్ – చైతు ఫైట్
గోపీ సుంద‌ర్ మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్
అక్క‌డ‌క్క‌డ‌ పాత సినిమాలు గుర్తుకురావ‌డం..

విశ్లేష‌ణ – అత్త‌, అల్లుడు కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అనుకుంటారు కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అత్త‌, అల్లుడు క‌థ‌ల‌కు పూర్తి భిన్నంగా ఉంది. ఇగో వ‌ల్ల‌ త‌ల్లికూత‌రు మ‌ధ్య ఉన్న ప్రాబ్ల‌మ్ ని సాల్వ్ చేసి త‌ను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే క‌థాంశాన్ని చాలా ఎంట‌ర్ టైన్ గా చెప్ప‌డంతో మారుతి స‌క్స‌స్ అయ్యాడు. అక్కినేని అంద‌గాడు చైత‌న్య ఈ చిత్రంలో మ‌రింత అందంగా క‌నిపించాడు. అలాగే రొమాంటిక్, యాక్ష‌న్, ఎమోష‌న్.. సీన్స్ లో ఫ‌ర్ ఫార్మెన్స్  అద‌ర‌గొట్టేసాడు. అను ఇమ్మాన్యుయేల్ కూడా ఇగో ఉన్న అమ్మాయిగా త‌ల్లికి త‌గ్గ కూతురుగా బాగా న‌టించింది. ఇక ప‌వ‌ర్ ఫుల్ శైల‌జారెడ్డి పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఏపాత్ర అయినా స‌రే..అవ‌లీల‌గా న‌టించి మెప్పించ‌గ‌ల ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో అద్భుతంగా న‌టించారు. వెన్నెల కిషోర్, పృథ్వీల పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు ఆల్ ఆడియ‌న్స్ ని బాగా ఎంట‌ర్ టైన్ చేస్తున్నాయి. ముర‌ళీశ‌ర్మ ఇగో ఉన్న ఫాద‌ర్ గా బాగా న‌టించారు. దాస‌రి అరుణ్ కుమార్ శైల‌జారెడ్డి త‌మ్ముడుగా న‌టించారు. కానీ..ఈ పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. టైటిల్ సాంగ్, అను బేబీ, ఎగిరే పాట‌లు బాగున్నాయి. గోపీ సుంద‌ర్ రీ రికార్డింగ్ బాగుంది. సితార ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించింది. సినిమాటోగ్ర‌ఫీ, ఎడిటింగ్..బాగున్నాయి. ఫైన‌ల్ గా శైల‌జారెడ్డి అల్లుడు గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే..అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటున్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్.

రేటింగ్ – 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here