Home Telugu శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్..!

శైల‌జారెడ్డి అల్లుడు రిలీజ్ డేట్ ఫిక్స్..!

128
0
Sailajareddy Alludu release date

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు.  ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. చైత‌న్య స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టించ‌గా, చైతుకు అత్త‌గా ర‌మ్య‌కృష్ణ న‌టించారు.  అయితే…ఈ సినిమాతో పాటు నాగ చైత‌న్య స‌వ్య‌సాచి సినిమాని కూడా స్టార్ట్ చేయ‌డంతో ఈ రెండు సినిమాల షూటింగ్ డేట్స్ విష‌యంలో క్లాష్ రావ‌డం..ఆత‌ర్వాత స‌వ్య‌సాచి గ్రాఫిక్స్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న లేట్ అవ్వ‌డం తెలిసిందే.

దీంతో స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది అనేది స‌స్పెన్స్ గా మారింది. అయితే..శైల‌జారెడ్డి అల్లుడు చిత్రాన్ని ముందుగా అనుకున్న‌ట్టుగా ఆగ‌ష్టు 31న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు. ఇక టీజ‌ర్ ను ఆగ‌ష్టు 1న రాత్రి 7.10 నిమిషాల‌కు రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here