Home Movie News శ్రీకాంత్ అడ్డాల చిత్రం ఎప్పుడు..?  ఎవ‌రితో..?

శ్రీకాంత్ అడ్డాల చిత్రం ఎప్పుడు..?  ఎవ‌రితో..?

111
0
Srikanth-Addala-In-Geetha-Arts-1510637380-1905

కొత్త బంగారులోకం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..ఆత‌ర్వాత సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ముకుంద చిత్రాల‌తో అటు ఆడియ‌న్స్ లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను మంచి గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. ఆత‌ర్వాత సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో బ్ర‌హ్మోత్స‌వం సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీకాంత్ అడ్డాల త‌దుపరి చిత్రం ఏంట‌నేది ఎనౌన్స్ చేయ‌లేదు.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…శ్రీకాంత్ అడ్డాల‌తో గీతా ఆర్ట్స్ సంస్థ సినిమా ప్లాన్ చేస్తుంద‌ని తెలిసింది. ఇందులో శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్నాడ‌ట‌. ఇటీవ‌ల శ్రీకాంత్ అడ్డాల క‌థ చెప్ప‌డం..క‌థ విని శ‌ర్వానంద్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింద‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ద‌స‌రా రోజున ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. మ‌రి…ఈ సినిమాతో అయినా స‌క్స‌స్ సాధించి శ్రీకాంత్ అడ్డాల మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here