Home Actor శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడు..?

శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎప్పుడు..?

41
0

కొత్త బంగారు లోకం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై…తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. ఆత‌ర్వాత సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, ముకుంద‌, బ్ర‌హ్మోత్స‌వం చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల‌. అయితే… మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించిన బ్ర‌హ్మోత్స‌వం సినిమా ఫ్లాప్ అయ్యింది. అంతే…ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీకాంత్ అడ్డాల త‌దుప‌రి చిత్రాన్ని ఎనౌన్స్ చేయ‌లేదు.

అయితే…ఆయ‌న గీతా ఆర్ట్స్ సంస్థ‌లో సినిమా చేయ‌నున్న‌ట్టు గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి కానీ… అఫిషియ‌ల్  ఎనౌన్స్ మెంట్ మాత్రం రావ‌డం రాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే…స్ర్కిప్ట్ ఫైన‌ల్ అయ్యింద‌ట‌. వినూత్నంగా ఉండే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని తెలిసింది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో నాని హీరోగా న‌టించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. నాని ప్ర‌స్తుతం గ్యాంగ్ లీడ‌ర్, వి చిత్రాల్లో న‌టిస్తున్నారు. మ‌రి..నాని – శ్రీకాంత్ అడ్డాల కాంబినేష‌న్ లో రూపొందే ఈ సినిమాని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here