Home Political News శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్, మ‌నోహ‌ర్..!

శ్రీవారిని ద‌ర్శించుకున్న ప‌వ‌న్, మ‌నోహ‌ర్..!

99
0

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మనోహ‌ర్, తిరుప‌తి వెళ్లి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని క‌లుసుకున్నారు. ఈరోజు ఉద‌యం ప‌వ‌న్, మ‌నోహ‌ర్ ఇద్ద‌రు తిరుమ‌ల‌లోని శ్రీవారిని ద‌ర్శించుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంత‌రం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి… స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నాందెడ్ల మనోహర్ ఈరోజు జ‌న‌సేన పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయ‌న గుంటూరు జిల్లాలోని తెనాలి ఇయోజ‌క‌వ‌ర్గం నుంచి జనసేన తరపున‌ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరిన‌ప్ప‌టికీ ఆయన మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే.. కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీకి ఆయన దూరంగా ఉంటున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా జ‌న‌సేన పార్టీలో చేరి షాక్ ఇచ్చారు. జ‌న‌సేన భావ‌జాలం, ప‌వ‌న్ వ్య‌క్తిత్వం నచ్చ‌డంతో ఈ పార్టీలో చేరిన‌ట్టు తెలియ‌చేసారు. క్లీన్ ఇమేజ్ ఉన్న మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీలో చేర‌డం యువ‌కుల‌కి మ‌రింత స్ఫూర్తినిస్తుంద‌ని జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు హ‌ర్షం వ్య‌క్తం చేసాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here