Home Actor శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం ట్రైల‌ర్ ను ఆవిష్క‌రించ‌నున్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.

శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం ట్రైల‌ర్ ను ఆవిష్క‌రించ‌నున్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.

31
0
శ‌ర్వానంద్ ర‌ణ‌రంగం ట్రైల‌ర్ ను ఆవిష్క‌రించ‌నున్న త్రివిక్ర‌మ్ శ్రీనివాస్. spiceandhra

యువ హీరో శర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం ర‌ణ‌రంగం. ఈ చిత్రానికి సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ‌ర్వానంద్ స‌ర‌స‌న కాజల్ అగర్వాల్ , కళ్యాణి ప్రియదర్శన్ న‌టిస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

90వ దశకం నాటి గ్యాంగ్ స్టర్ నేపధ్య కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ మరియు సాంగ్స్, వీక్షకుల నుండి మంచి స్పందన వ‌చ్చింది. ఇక ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైలర్ ని మాటల మాంత్రికుడు, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులమీదుగా ఆగష్టు 4 న ఆవిష్కరించనున్నారు.

ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కాకినాడ లో తాజా షెడ్యూల్ జరుపుకుంటుంది. అందుచేత ర‌ణ‌రంగం మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని అక్కడే ప్లాన్ చేసింది రణరంగం సినిమా యూనిట్.  ఈ సినిమా స్వాతంత్య్ర‌ దినోత్సవ కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here