Home Actor శ‌ర్వా గెడ్డం లుక్ లో ఉన్న సీక్రెట్ ఇదే..

శ‌ర్వా గెడ్డం లుక్ లో ఉన్న సీక్రెట్ ఇదే..

69
0

అమ్మ చెప్పింది, క్లాస్ మేట్స్, గ‌మ్యం, ప్ర‌స్ధానం, ర‌న్ రాజా ర‌న్, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శ‌త‌మానం భ‌వ‌తి, మ‌హానుభావుడు, ప‌డిప‌డి లేచే మ‌న‌సు…ఇలా వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యువ హీరో శ‌ర్వానంద్.మూస‌ కథలకు ఫుల్ స్టాఫ్ పెట్టి కొత్త క‌థ‌ల‌తో సినిమా చేసే శ‌ర్వా ప్ర‌స్తుతం సుధీర్ వ‌ర్మ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. అయితే… ఈరోజు శ‌ర్వానంద్ పుట్టిన‌రోజు. ఈ  సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

ఈ లుక్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో పూర్తి గెడ్డంతో మధ్య వయస్కుడిగా కనిపిస్తున్నాడు శర్వా. గెడ్డం లుక్ వెన‌కున్న సీక్రెట్ ఏంటంటే…ఈ సినిమాలో శర్వా రెండు పాత్రల్ని చేస్తున్నాడు. వాటిలో ఒకటి మిడిల్ ఏజ్డ్ మ్యాన్ కాగా, మరొకటి యంగ్ క్యారెక్టర్. ఈ రెండు పాత్రలకూ సమాన ప్రాధ్యాన్యం ఉండటంతో పాటు, రెండింటి మధ్యా ఘర్షణ కూడా ఉంటుందని తెలిసింది. ఆ ఇద్దరి సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నాయికలుగా నటిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి…ప‌డి ప‌డి లేచే మ‌న‌సుతో ఆక‌ట్టుకోలేక‌పోయిన శ‌ర్వాకి ఈ సినిమా స‌క్స‌స్ అందిస్తుందేమో చూడాలి.   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here