Home Movie News షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అంతరిక్షం 9000 KMPH

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న అంతరిక్షం 9000 KMPH

101
0
Doa462RUwAIYym2

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి , లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం  అంతరిక్షం 9000 KMPH. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ  చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో తెలియజేశారు. షూటింగ్ స్పాట్ లోని ఓ ఫోటోని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్ గా అనిపించింది అని వెల్లడించారు. మొదటి సినిమా ‘ ఘాజి’ తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిన  ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు.

త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా , ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్, సాయి బాబు జాగర్లమూడి , రాజీవ్ రెడ్డి లు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు.  డిసెంబర్ 21 న సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.  తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.

వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు న‌టించిన ఈ చిత్రానికి దర్శకుడు: సంకల్ప్ రెడ్డి, సమర్పణ‌ : క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి, బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, డీఓపీ : జ్ఞాన శేఖర్ VS, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: ప్రశాంతి విహారీ, ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా, యాక్షన్ కొరియోగ్రాఫర్: టాడార్ పెట్రోవ్ లాజరోవ్, CG : రాజీవ్ రాజశేఖరన్, PRO: వంశీశేఖర్

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here