Home Political News సంక్షేమ ప‌ధ‌కాలే న‌న్ను గెలిపిస్తాయి – సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌ద్మారావు గౌడ్

సంక్షేమ ప‌ధ‌కాలే న‌న్ను గెలిపిస్తాయి – సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌ద్మారావు గౌడ్

104
0

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలే త‌న‌ని గెలిపిస్తాయ‌ని..ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో విజ‌యం సాధిస్తాన‌ని ఆప‌ద్ధ‌ర్మ మంత్రి, సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ అభ్య‌ర్ధి ప‌ద్మారావు గౌడ్ ఆశాభావం వ్య‌క్తం చేసారు. సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పాద‌యాత్ర చేసారు. స్ధానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి తార్నాక డివిజ‌న్ ప‌రిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాలుగున్న‌ర సంవ‌త్స‌రాల కాలంలోనే ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు.

కుట్ర‌తో ఏర్ప‌డిన కూట‌మికి ప్ర‌జ‌లు లొంగ‌ర‌ని వారికి డిపాజిట్ కూడా ద‌క్క‌వ‌న్నారు. అహ‌ర్నిశ‌లు ప్ర‌జాభివృద్ధి కోసం ప‌ని చేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని.. ఒంట‌రి మ‌హిళ ఇబ్బందుల‌ను గుర్తించిన ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని వివ‌రించారు. పాల‌న యంత్రాంగాన్ని ప్ర‌జ‌ల‌కు తాము స‌న్నిహితం చేసామ‌ని మంత్రిగా విధులు నిర్వ‌ర్తించిన‌ప్ప‌టికీ ఎక్కువ స‌మ‌యం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల‌కు వినియోగించేలా వ్య‌వ‌హ‌రించాన‌ని తెలిపారు.

ప్ర‌జ‌ల ఫిర్యాదు విన్న వెంట‌నే ప‌రిష్క‌రించేలా ప్ర‌త్యేక ఏర్పాట్లు జ‌రిపామ‌ని.. త‌మ ప‌లుకుబ‌డిని వినియోగించి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి అధిక నిధులు సాధించామ‌ని.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు సాఫీగా సాగేందుకు మ‌రో అవ‌కాశం క‌ల్పించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో తార్నాక డివిజ‌న్ కార్పోరేట‌ర్ ఆల‌కుంట స‌ర‌స్వ‌తి హ‌రి, సీతాఫ‌ల‌మండి కార్పోరేట‌ర్ సామ‌ల హేమ‌, టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here