Home Actor సందీప్ ఫ‌స్ట్ టికెట్ ఎవ‌రికి ఇచ్చాడో తెలుసా..?

సందీప్ ఫ‌స్ట్ టికెట్ ఎవ‌రికి ఇచ్చాడో తెలుసా..?

39
0
సందీప్ ఫ‌స్ట్ టికెట్ ఎవ‌రికి ఇచ్చాడో తెలుసా..? spiceandhra

యువ హీరో సందీప్ కిషన్ న‌టించిన తాజా చిత్రం నిను వీడని నీడను నేనే. కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన  ఈ సినిమా రేపు (జులై 12)న  ప్రేక్షకుల ముందుకు వ‌స్తుంది. నిన్నరాత్రి సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా నిఖిల్, సుధీర్ బాబు, కార్తికేయ, విష్వక్సేన్ హాజరయ్యారు.

ఈ సినిమా సెకండ్ టికెట్ఈ యువ హీరోల‌కు సందీప్ కిషన్ అందజేశాడు. ఫస్ట్ టికెట్ ఏ హీరోకి ఇవ్వనున్నది ‘గురువారం’ చెబుతానని అన్నాడు. దీంతో ఎవ‌రికి ఇస్తాడా అని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే… ఈ రోజు సందీప్ కిషన్ తన సినిమా ఫస్ట్ టికెట్ ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ కి అందజేశాడు. హైద‌రాబాద్ ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా టికెట్ ను ప్రభాస్ కి అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. ఖ‌చ్చితంగా సందీప్ కిష‌న్ కి విజ‌యాన్ని అందిస్తుంద‌ని టీమ్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఎప్ప‌టి నుంచో స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురు చూస్తోన్న సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here