Home News సడెన్ గా వైఎస్‌ షర్మిల ప్రెస్ మీట్… చంద్రబాబు మీద విమర్శలు… ప్రచారం హోరు.

సడెన్ గా వైఎస్‌ షర్మిల ప్రెస్ మీట్… చంద్రబాబు మీద విమర్శలు… ప్రచారం హోరు.

58
0


చంద్రబాబు నాయుడు హయంలో రాష్ట్రంలో అభివృద్ధి 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైఎస్‌ షర్మిల అన్నారు.  సోమవారం అమరావతిలో ఆమె మీడియా సమవేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. అదే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు.  అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు… రైతులను మోసం చేశారని విమర్శించారు.  మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు…తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు.

‘ నేను వైఎస్సార్‌ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నా.. భూత‌ద్దం పెట్టుకుని వెతికినా రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసుకుంటూ పాల‌న సాగించారు. మ‌హానేత వైఎస్సాఆర్ హ‌యాంలో పేద కుటుంబం సంతోషంగా ఉండేది. రైతు కుటుంబం ధైర్యంగా ఉండేది. పంట‌కు గిట్టుబాటు ధ‌ర ఉండేది. ప్ర‌తి వ్య‌క్తికి ఉపాధి ఉండేది. పేద‌ విద్యార్థి గొప్ప‌ చ‌దువులు ఉచితంగా చ‌దువుకునేలా పూర్తి రీయింబ‌ర్స్‌మెంట్ ఉండేది. కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు ఆఖ‌రికి పార్టీల‌కు కూడా అతీతంగా ముఖ్య‌మంత్రి హోదాలో ఉన్న వైఎస్సార్‌ ప్ర‌తి వ‌ర్గానికి మేలు చేసిన నాయ‌కుడు.’  అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here