Home News సభాపతి కోడెలతో మాజీ ఎంపీ లగడపాటి భేటీ.

సభాపతి కోడెలతో మాజీ ఎంపీ లగడపాటి భేటీ.

69
0


కోడెల, లగడపాటి భేటీ పై ఆసక్తికర చర్చ జ‌రుగుతోంది. అర గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరిపారు.  ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న లగడపాటి ఇటీవల కాలంలో తరచూ టీడీపీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఆయన ఆ పార్టీలో చేరొచ్చని గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఈ  నేపథ్యంలో కోవెల,  లగడపాటి మధ్య రాజకీయ పరమైన చర్చలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు.

గుంటూరు టౌన్ లోని చుట్టుగంట సెంటర్‌లో ఉన్న హోండా షోరూమ్ లో వీరిద్ద‌రు ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. దీంతో సత్తెనపల్లిలో పోటీ పై లగడపాటి సర్వే చేశారా..? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి సత్తెనపల్లి లేదా నరసరావుపేట నుంచి కోడెల శివప్రసాదరావు పోటీ చేస్తారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here