Home Movie Reviews సాక్ష్యం రివ్యూ..!

సాక్ష్యం రివ్యూ..!

119
0
Saakshyam review

అల్లుడు శీను సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే క‌మ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ సాధించి.. ఆత‌ర్వాత స్పీడున్నోడు, జ‌య జాన‌కి నాయ‌క‌..చిత్రాల‌తో ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తాజాగా శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన చిత్రం సాక్ష్యం. రొటీన్ గా కాకుండా కొత్త క‌థ‌ల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. ఆత‌ర‌హా క‌థ‌ల‌ను చేయ‌డానికి హీరోలు కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో పంచ‌భూతాలు అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో సాక్ష్యం సినిమా రూపొందడంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమాని అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో అభిషేక్ నామా నిర్మించారు. రిలీజ్ కి ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సాక్ష్యం ఈరోజు (జులై 27) ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. మ‌రి..సాక్ష్యం సాయిశ్రీనివాస్, శ్రీవాస్ ల‌కు స‌క్స‌స్ అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – స్వ‌స్తిక్ పురంలో రాజు గారు (శ‌ర‌త్ కుమార్) పేద‌ల‌కు అండ‌గా ఉంటారు. ఈ ఊరులోనే మునుస్వామి (జ‌గ‌ప‌తిబాబు) అత‌ని త‌మ్ముళ్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. వీరి అక్ర‌మాల‌ను రాజు గారు అడ్డుప‌డుతుంటారు. ఇది స‌హించ‌లేని మునుస్వామి ఓరోజు రాత్రి రాజు గారు ఇంటికి వ‌చ్చి రాజు గారి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు. అయితే..రాజు గారి బాబు ఆవుదూడ కాపాడుతుంది. ఆవుదూడ కాపాడిన ఆ శిశువు కాశీ చేరుతుంది. పిల్ల‌లు లేని శివ‌ప్ర‌కాష్ (జ‌య‌ప్ర‌కాష్) దంప‌తులు పెంచుకుంటారు. ఆ బాబుకి విశ్వ‌జ్ఞ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్) అని పేరు పెడ‌తారు. విదేశాల్లో ఉన్న విశ్వ‌జ్ఞ పెద్ద‌య్యాక వీడియో గేమ్ ప్లాన్ చేస్తుంటాడు. అత‌నికి సౌంద‌ర్య‌ల‌హ‌రి (పూజా హేగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. తొలి ప‌రిచ‌యంలోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే..పంచ‌భూతాలు రాజు గారు ఫ్యామిలీని చంపేసిన మునుస్వామి..అత‌ని త‌మ్ముళ్ల‌ను ఎలా చంపాయి..?  దీనికి విశ్వ‌జ్ఞ ఏం చేసాడు..?   విశ్వ‌జ్ఞ  త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకున్నాడు..?  ఆఖ‌రి త‌న ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడా..?  లేదా అనేది క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

క‌థ‌

రీ రికార్డింగ్

డైలాగులు

విజువ‌ల్స్

మైన‌స్ పాయింట్స్

ప్ర‌తి నాయ‌కుడు బ‌లంగా లేక‌పోవ‌డం

విశ్లేష‌ణ -ఒక ఫ్యామిలీ మొత్తాన్ని..విల‌న్ చంపేయ‌డం…ఆ ఫ్యామిలీకి చెందిన చిన్న‌పిల్లాడు త‌ప్పించుకోవ‌డం..వాడు పెద్ద‌వాడై విల‌న్ మీద ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం..ఇలాంటి క‌థ‌ల‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే..ఈ క‌థ‌నే తీసుకుని ప్ర‌తీకారాన్ని ఆ ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి కాకుండా పంచ‌భూతాలు తీర్చుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా ఆ ఫ్యామిలీకి చెందిన వ్య‌క్తి బ‌తికున్నాడ‌ని విల‌న్ కి తెలియ‌దు. త‌న ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసార‌నే విష‌యం హీరోకి తెలియ‌దు. అయినా..హీరోకి త‌న ఫ్యామిలీని చంపేసిన విల‌న్ ల‌ను చంపేయాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ‌డం.. దీనికి పంచ‌భూతాలు స‌హ‌క‌రించ‌డం. చాలా కొత్త‌గా ఉంది క‌దా..! ఈ విభిన్న‌మైన క‌థ‌ను శ్రీవాస్ చాలా ఇంట్ర‌స్టింగ్ గా చూపించారు. సినిమా బిగినింగ్ లో.. ఆవు దూడ చిన్న‌పిల్లాడిని కాపాడే ఎపిసోడ్ ని చాలా బాగా తెర‌కెక్కించారు. ఈ ఎపిసోడ్ ఆడియ‌న్స్ ని  సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేసింది.

అయితే..ఇంట్ర‌స్టింగ్ గా వెళుతున్న క‌థ‌లో పాట‌లు అడ్డంకిగా అనిపిస్తుంటాయి.  సంగీత ద‌ర్శ‌కుడు రామేశ్వ‌ర్ అందించిన రీ రికార్డింగ్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం అని చెప్ప‌చ్చు. హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు డ్యాన్స్ & యాక్ష‌న్ సీన్స్ ల‌లో చాలా ఎన‌ర్జిటిక్ గా న‌టించాడు. అలాగే హీరోయిన్ సౌంద‌ర్య‌ల‌హ‌రి పాత్ర‌ను కొత్త‌గా ప్ర‌వ‌చ‌నాలు చెప్పే అమ్మాయిగా చూపించ‌డం బాగుంది. గీత ర‌చ‌యిత అనంత శ్రీరామ్ ఈ సినిమాలో వాల్మీకి పాత్ర‌లో క‌నిపించారు. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను చాలా ఇంట్ర‌స్టింగ్ గా చూపించాల‌నే ఉద్దేశ్యంతో థ్రిల్ల‌ర్ త‌ర‌హాలో చెప్పాల‌నుకోవ‌డం బాగుంది. అయితే…విల‌న్ పాత్ర‌ను బ‌లంగా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. నిర్మాత ఏమాత్రం రాజీప‌డ‌కుండా చాలా రిచ్ గా ఈ సినిమాని నిర్మించారు. సాయిమాధ‌వ్ డైలాగులు, ఆర్థ‌ర్ ఏ విల్స‌న్ సినిమాటోగ్ర‌ఫీ, పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్ బాగున్నాయి. స్ర్కిప్ట్ లో ఇంకొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే..ఇంకా బాగుండేది. మొత్తానికి సాక్ష్యం సినిమా గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే…క్లాసు, మాసు అనే తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చే సినిమా సాక్ష్యం..!

రేటింగ్ – 3/5

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here