Home Movie News సామి స్క్వేర్ రిలీజ్  డేట్ ఫిక్స్..!

సామి స్క్వేర్ రిలీజ్  డేట్ ఫిక్స్..!

91
0
Vikram-and-Keerthy-Suresh-make-a-nice-pair-in-this-still-from-Saamy-Square-420x280

విక్ర‌మ్ హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం సామి. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో ఘ‌న విజ‌యం సాధించింది. ఆత‌ర్వాత ఇప్పుడు విక్ర‌మ్ – హ‌రి క‌లిసి సామి సీక్వెల్ గా సామి స్క్వేర్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఈ చిత్రం కోసం కీర్తి సురేష్ ఓ పాట పాడ‌డం తెలిసిందే. ఈ సాంగ్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమా పై తెలుగు, త‌మిళ్ లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ మూవీని సెప్టెంబ‌ర్ 20న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. విక్ర‌మ్ – కీర్తి సురేష్ ఇద్ద‌రికీ తెలుగు, త‌మిళ్ లో క్రేజ్ ఉండ‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమాకి మంచి ఒపెనింగ్స్ వ‌స్తాయి. అంద‌ర్నీ ఆక‌ట్టుకుని సామి సినిమా వ‌లే ఈ సామి స్క్వేర్ కూడా విజ‌యం సాధిస్తుంద‌ని టీమ్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి..సామి స్క్వేర్ ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here