Home Movie News సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త చిత్రం  చిత్ర ల‌హ‌రి ప్రారంభం..!

సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త చిత్రం  చిత్ర ల‌హ‌రి ప్రారంభం..!

79
0

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న హ‌లో బ్యూటీ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ న‌టిస్తుంది. నేను శైల‌జ ఫేమ్ కిషోర్ తిరుమ‌ల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది సాయిధ‌ర‌మ్ తేజ్ కి 11వ చిత్రం. పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైన ఈ చిత్రం ప్రారంభోత్స‌వంకు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ముఖ్య అతిధిగా హాజ‌రై ముహుర్తపు స‌న్నివేశానికి క్లాప్ కొట్టారు.

వైవిధ్య‌మైన క‌థాంశంతో రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందే ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవ‌ల రిలీజైన సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో స్టోరీ విష‌యంలో చాలా కేర్ తీసుకుని ఫైన‌ల్ గా కిషోర్ తిరుమ‌ల చెప్పిన స్టోరీకి ఓకే చెప్పాడు. ఈ మూవీ పై తేజు చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. మ‌రి…కిషోర్ తిరుమ‌ల తేజుకి ఆశించిన విజ‌యాన్ని అందిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here