Home Actor సాహోకి దిల్ రాజు భారీ ఆఫ‌ర్..?

సాహోకి దిల్ రాజు భారీ ఆఫ‌ర్..?

69
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న భారీ చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రం రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి. క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ శ్ర‌ద్థా క‌పూర్ న‌టిస్తోన్న‌ ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.  ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం పోటీ పెద్ద ఎత్తున వున్నట్టుగా తెలుస్తోంది.

నైజామ్, ఉత్తరాంధ్ర ఏరియాల డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు 45 కోట్లను ఆఫర్ చేసినట్టుగా వార్తలు వ‌స్తున్నాయి. ఈ స్థాయిలో పోటీపడే డిస్ట్రిబ్యూటర్స్ లేకపోవడం వలన, ఈ ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులు దిల్ రాజుకి ఖాయమైనట్టేనని అంటున్నారు. అయితే…చిత్ర యూనిట్ కానీ…దిల్ రాజు కానీ..ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై స్పందించ‌ లేదు.

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ చేస్తున్న సినిమా కావ‌డంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మ‌రి..సాహో ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here