Home Actor సాహో చిత్రంలో స‌ల్మాన్ వార్త‌ల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్ సుజిత్..!

సాహో చిత్రంలో స‌ల్మాన్ వార్త‌ల పై క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్ సుజిత్..!

98
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. ఈ చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యు.వి. క్రియేష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తుంది.  ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోంది. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని ఆగ‌ష్టు 15న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే….ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సాహోలో స‌ల్మాన్ న‌టిస్తున్నాడా..? ఇది నిజ‌మా..?  కాదా..? అనేది అంద‌రిలో ఉన్న సందేహం. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. ఇంత‌కీ ఏమ‌న్నాడంటే..సాహో షూటింగ్ పూర్తికావస్తోంది, ఇలాంటి సమయంలో పుకార్లు ఎలా పుడుతున్నాయో అర్థంకావడంలేదని అన్నారు.

ఈ చిత్రంలో సల్మాన్ ఎలాంటి అతిథి పాత్ర పోషించడంలేదు.  ఇది పుకారు మాత్రమేనని, ఎవరూ నమ్మవద్దని చెప్పారు. చిత్రీకరణ దాదాపు ముగింపు దశకు వచ్చిన సమయంలో ఇలాంటి ఊహాగానాల వల్ల ఏమిటి ఉపయోగం? అంటూ మండిపడ్డారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here