Home Actor సాహో టీజ‌ర్ సంచ‌ల‌నం..!

సాహో టీజ‌ర్ సంచ‌ల‌నం..!

72
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో. సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. యు.వి. క్రియేష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అయితే…నిన్న రిలీజ్ చేసిన‌ సాహో టీజ‌ర్ ను ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో.. సాహో చిత్రం పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.

 అయితే.. టీజర్ చూసిన తర్వాత ఎన్నడూలేనంత హైప్ క్రియేట్ అయింది. ఆన్ లైన్ లో సాహో టీజర్ కు లభిస్తున్న డిజిటల్ వ్యూసే అందుకు నిదర్శనం. టీజర్ రిలీజైన కేవలం 6 గంటల్లోనే 25 మిలియ‌న్స్ అంటే..2.5 కోట్ల వ్యూస్ వచ్చాయంటే అతిశయోక్తి కాదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్ ఆన్ లైన్ మీడియంలో దుమ్మురేపుతోంది. సరికొత్త రికార్డుల దిశగా పరుగులు తీస్తోంది. ఈ టీజర్ ఒక్క హిందీలోనే అత్యధికంగా 62 లక్షల వ్యూస్ సంపాదించడం విశేషం.

తెలుగులో 51 లక్షల వ్యూస్ లభించాయి. ప్రభాస్ నటించిన యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుండ‌డంతో టీజ‌రే ఇలా ఉంటే…ఇక సినిమా ఎలా ఉంటుందో అనే ఆస‌క్తిని పెంచేసింది. ఆగ‌ష్టు 15న ఈ సంచ‌ల‌న చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..సాహో చిత్రంతో ప్ర‌భాస్ ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here