Home Actor సాహో ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది.

సాహో ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది.

35
0
సాహో ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది spiceandhra

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ క్రేజీ మూవీని యు.వి. క్రియేష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌ఫూర్ న‌టిస్తోన్న ఈ మూవీ కోసం అభిమానులు ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

అయితే.. ఆగ‌ష్టు 15న రావాల్సిన ఈ సినిమా ఆగ‌ష్టు 30న వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన‌ చిత్రయూనిట్ టీజర్‌లతో పాటు పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లను రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. భారీ అంచనాలున్న సాహో ట్రైలర్‌ను ఆగస్టు 10న రిలీజ్‌ చేస్తున్నట్టుగా సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌చేసారు.

ఈ సినిమాలో జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్ విజయ్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, వెన్నెల కిశోర్‌, మలయాళ నటుడు లాల్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజ‌ర్ తో యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సాహో ఇక ట్రైల‌ర్ తో ఇంకెంత సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here