Home Actor సాహో తో సెల్ఫీ.. ఎందుకో తెలుసా..?

సాహో తో సెల్ఫీ.. ఎందుకో తెలుసా..?

28
0
సాహో తో సెల్ఫీ..ఎందుకో తెలుసా..? spiceandhra

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న తాజా చిత్రం సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో యు.వి.క్రియేష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇక సాహో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. గుమ్మ‌డి కాయ కొట్టేసారు. సోమ‌వారంతో ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది.

ఈ సంద‌ర్భంగా యూనిట్ స‌భ్యుల‌తో ప్ర‌భాస్ సెల్ఫీ తీసుకున్నారు. అలాగే ప్ర‌భాస్ తో యూనిట్ స‌భ్యులు తీసుకున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 2017 జూన్ 9న సాహో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా పూర్త‌వ్వ‌డానికి 25 నెల‌లు ప‌ట్టింది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ శ్ర‌ద్ధాక‌పూర్ న‌టిస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన టీజ‌ర్ & సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

ఈ భారీ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమాని ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు సాహో రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. మ‌రి..సాహో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here