Home Actor సాహో ఫ‌స్ట్ సాంగ్ సైకో స‌యాన్ టీజ‌ర్ రిలీజ్.

సాహో ఫ‌స్ట్ సాంగ్ సైకో స‌యాన్ టీజ‌ర్ రిలీజ్.

51
0
సాహో ఫ‌స్ట్ సాంగ్ సైకో స‌యాన్ టీజ‌ర్ రిలీజ్. spiceandhra

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ –  యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సాహో. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ న‌టిస్తుంది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన‌ ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఈ టీజ‌ర్ యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ సన్నివేశాలతో టీజర్ అదరగొట్టడంతో సినిమా పై అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.  ఈ రోజు సాహో లోని ‘సైకో సయ్యా’ అంటూ సాగే సాంగ్  టీజర్ ని యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.  వెస్ట్రన్ బీట్ తో సాగే ఈ సాంగ్ టీజర్ లో ప్రభాస్, శ్రద్ధ అల్ట్రా స్టైలిష్ లుక్ కాస్ట్యూమ్స్ లో అదరగొట్టారు.

 ఇక టీజర్ లో ప్రభాస్ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవడం ఖాయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా సాహో చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here