Home Actor సాహో రిలీజ్ వాయిదా. ఇంత‌కీ కార‌ణం ఏంటి..?

సాహో రిలీజ్ వాయిదా. ఇంత‌కీ కార‌ణం ఏంటి..?

25
0
సాహో రిలీజ్ వాయిదా. ఇంత‌కీ కార‌ణం ఏంటి..? spiceandhra

బాహుబలి సినిమా త‌ర్వాత‌ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తోన్న సెన్సేష‌న‌ల్ మూవీ ‘సాహో’.ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక‌ ఆగ‌ష్టు 15న విడుద‌ల ఖాయం అనుకుంటే.. సాహో వాయిదా ప‌డి అంద‌రికీ షాక్ ఇచ్చింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన సాహో టీజ‌ర్ & సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

అస‌లు వాయిదా ప‌డ‌డానికి కార‌ణం ఏంటంటే… సాహోను ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేశారని స‌మాచారం. లేట్ అయినా మంచి క్వాలిటీతో ఉన్న సినిమాని అందించాల‌నే ఉద్దేశ్యంతోనే సాహో టీమ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌.

 ప్రస్తుతం ఈ సినిమా స్థానాన్ని యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రణరంగం చిత్రం ఆక్రమిస్తోంది. ఈ సినిమాని ఆగస్టు 2న విడుదల చేయాల‌నుకున్నారు కానీ … కొన్ని అనివార్య కారణాల రీత్యా రణరంగం విడుదలను చిత్ర బ‌ృందం ఆగస్ట్ 15కు వాయిదా వేసింది. ఈ చిత్రంతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఎవరు సినిమా కూడా విడుదల కాబోతోంది. ఆగ‌ష్టు 9న మ‌న్మ‌థుడు 2 ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. సో.. ఆగస్ట్ నెల‌ సినీ ప్రియులకు పండ‌గే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here