Home Actor సాహో రొమాంటిక్ పోస్ట‌ర్ రిలీజ్..!

సాహో రొమాంటిక్ పోస్ట‌ర్ రిలీజ్..!

40
0
సాహో రొమాంటిక్ పోస్ట‌ర్ రిలీజ్..! spiceandhra

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ జంట‌గా న‌టిస్తున్న ప్రెస్టేజీయ‌స్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుంచి యాక్ష‌న్ సీన్స్ తో ఉన్న టీజ‌ర్ రిలీజ్ చేసారు. అలాగే సాంగ్ రిలీజ్ చేసారు. ఈ రోజు ఈ మూవీ నుంచి రొమాంటిక్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.

ఆగ‌ష్టు 15న ఈ సినిమాని రిలీజ్ చేయాల‌నుకున్నారు అయితే… పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కి ఎక్కువ టైమ్ ప‌డుతుండ‌డంతో ఆగ‌ష్టు 30న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాహో టీమ్ ప్ర‌మోష‌న్స్ ను భారీ స్ధాయిలో చేసేందుకు ప్లాన్ చేస్తుంది. బాహుబ‌లి అనే ల్యాండ్ మార్క్ చిత్రం త‌రువాత వ‌స్తున్న చిత్రం కావ‌టంతో సినిమా ప్రేక్ష‌కులంద‌రి అంచ‌నాలు అందుకోవాలి. అందుకే చిన్న విష‌యంలో కూడా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.  వి ఎఫ్ ఎక్స్ కూడా అదే రేంజ్ లో వుండేలా కేర్ తీసుకుంటున్నాం అని చిత్ర నిర్మాత‌లు తెలియ‌చేసారు.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here