Home Actor సాహో సాంగ్ టీజ‌ర్ రిలీజ్. ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడు..?

సాహో సాంగ్ టీజ‌ర్ రిలీజ్. ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడు..?

160
0
సాహో సాంగ్ టీజ‌ర్ రిలీజ్. ఫుల్ సాంగ్ రిలీజ్ ఎప్పుడు..? spiceandhra

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సంచ‌ల‌న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌ఫూర్ న‌టిస్తుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్న సాహో చిత్రాన్ని ఆగ‌ష్టు 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. “నిన్నను మరిచేలా నిను ప్రేమిస్తాలే .. నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే’ అనే సాంగ్ బిట్ ను విడుద‌ల చేసారు.  ప్రభాస్ – శ్రద్ధా కపూర్ కాంబినేషన్లో విదేశాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగులో ప్రభాస్ మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా .. శ్రద్ధా కపూర్ కూడా మరింత గ్లామరస్ గా క‌నిపిస్తుంది.

ఆగస్టు 2వ తేదీన పూర్తి సాంగును విడుదల చేయనున్నారు. ఈ మెలోడియస్ సాంగ్ కి మంచి స్పంద‌న ల‌భిస్తుంది. యు.వి క్రియేష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తుంది. బాహుబ‌లి త‌ర్వాత వ‌స్తున్న ప్ర‌భాస్ మూవీ కావ‌డంతో సాహో పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. అంచ‌నాల‌ను అందుకుని ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here