Home Actor సాహో సెకండ్ పోస్ట‌ర్ అదిరిందిగా..!

సాహో సెకండ్ పోస్ట‌ర్ అదిరిందిగా..!

111
0

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ లేటెస్ట్ సెన్సేష‌న్ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ క్రేజీ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల ఈ మూవీ నుంచి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌భాస్ ఈ రోజు సెకండ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ పోస్టర్‌ను తన డార్లింగ్స్‌తో పంచుకున్నారు. ఫ‌స్ట్ పోస్టర్‌లో కళ్లద్దాలు పెట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించిన ప్రభాస్.. ఈ పోస్టర్‌లో బైక్ పై ర‌య్ ర‌య్ మంటూ వెళుతున్నట్టు క‌నిపించారు.

 ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి తరవాత ప్రభాస్ నటించిన సినిమా కావడం, భారీ బడ్జెట్‌తో యాక్షన్ ప్యాక్ట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండటంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఈ సినిమా పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

ఈ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏమాత్రం రాజీప‌డ‌కుండా యు.వి. క్రియేష‌న్స్  సంస్థ  ఈ సినిమాని నిర్మిస్తుంది. ఆగ‌ష్టు 15న ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here