Home Movie News సిల్లీ క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్..!

సిల్లీ క్యారెక్ట‌ర్ ఇంట్ర‌డ‌క్ష‌న్..!

95
0
sillyfellows silly carector

అల్ల‌రి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్ లో భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం సిల్లీ ఫెలోస్. బ్లూప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ సినిమా ట్రైల‌ర్ కి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో సినిమా ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌నే టాక్ ఉంది. ఈ సినిమాలో సీనియ‌ర్ యాక్ట‌ర్ జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి జాకెట్ జాన‌కి రామ్ అనే క్యారెక్ట‌ర్ పోషిస్తున్నారు.

ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే…ఆయ‌న పేరు – జాకెట్ జాన‌కిరామ్, వృత్తి – లేడీస్ టైల‌ర్ క‌మ్ ఎమ్మెల్యే, ప్ర‌వృత్తి – ఏదైనా మొద‌ట్నుంచి చెప్ప‌డం. మినిష్ట‌ర్ గారి భార్య‌కి జాకెట్లు అద‌ర‌కుట్టి ఆవిడ రిక‌మండెష‌న్ తో జాకెట్ స్పీడులో సారీ..జెట్ స్పీడులో ఎమ్మెల్యే అయిపోయాడు. రామోజీరావు గారు ఎంత గొప్ప‌వారైనా రోజూ ప్రియ ప‌చ్చ‌డే తింటుంటారు.ఆయ‌న‌లాగే ఎంత ఎత్తుకి ఎదిగినా గ‌తాన్ని మ‌ర‌చిపోకూడ‌ద‌నేది ఈయ‌న సిద్దాంతం.

అందుకే ఎమ్మెల్యే అయినా కూడా రోజుకో జాకెట్ల్ అయినా కుడుతుంటాడు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అయినా, త్రివిక్ర‌మ్ అయినా, ఒక క‌థ‌ని సినిమాగానే తీస్తారు కానీ ఈయ‌న మాత్రం ఒకే క‌థ‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పి ప‌క్క‌నోళ్ల‌ని విసిగిస్తాడు. ప్రేక్ష‌కుల్ని న‌వ్విస్తాడు. ఈ సిల్లీ ఫెలో చేసే అల్ల‌రిని చూసి ఆనందించ‌డానికి సెప్టెంబ‌ర్ 7న సిల్లీ ఫెలోస్ థియేట‌ర్ల పైకి దండెత్తండి మ‌రి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here