Home Movie News సిల్లీ క్యారెక్ట‌ర్ (శంక‌ర్ మేల్కోటే) ఇంట్ర‌డ‌క్ష‌న్..!

సిల్లీ క్యారెక్ట‌ర్ (శంక‌ర్ మేల్కోటే) ఇంట్ర‌డ‌క్ష‌న్..!

111
0
sillyfellows melkote

అల్ల‌రి న‌రేష్ – సునీల్ – భీమ‌నేని శ్రీనివాస్ కాంబినేష‌న్ లో రూపొందిన కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్స్ పై భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన సిల్లీ ఫెలోస్ చిత్రం  ఈ నెల 7న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్, సునీల్ తో పాటు చాలా మంది క‌మెడియ‌న్స్ ఉన్నారు.

శంక‌ర్ మేల్కోటే ఈ సినిమాలో గోవ‌ర్ధ‌న్ పేరుతో న‌వ్వించ‌డానికి వ‌స్తున్నారు. ఆయ‌న పేరు గోవ‌ర్ధ‌న్, మంత్రి – ఆరోగ్యం, మ‌నిషి – అనారోగ్యం. ఇత‌ని గురించి ఇంకా చెప్పాలంటే..తాగ‌ని తాగుళ్లు లేవు. తిర‌గ‌ని తిరుగుళ్లు లేవు. చ‌స్తామ‌ని తెలిసీ అక్ర‌మంగా సంపాదించే చాలా మందిలాగే ఇత‌నూ 500 కోట్లు అక్ర‌మంగా సంపాదించాడు. చ‌చ్చే ముందు పుణ్యం సంగ‌తి గుర్తొచ్చి త‌ను చేసిన ప్ర‌జా షేవ్ ని నిజ‌మైన ప్ర‌జా సేవ‌గా మార్చాల‌నుకున్నాడు. ఆ డ‌బ్బును దాచిన ప్లేస్ ని అనుచ‌రుడు జాకెట్ జాన‌కీ రామ్ కి చెప్పి మ‌రీ టపా క‌ట్టేసాడు. ఆ బ‌రువుని మోయ‌లేక‌ అత‌ను, ఆ గుట్టుని ప‌ట్టుకోవ‌డానికి మిగిలిన‌ వాళ్లు చేసిన హ‌డావిడి ఏంటో తెలుసుకోవాలంటే ఈ నెల 7న సిల్లీ ఫెలోస్ ధియేట‌ర్స్ పై దండెత్తండి మ‌రి..!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here