Home Movie News సిల్లీ ఫెలోస్ ఫ‌స్ట్ సాంగ్ అదిరింది..!

సిల్లీ ఫెలోస్ ఫ‌స్ట్ సాంగ్ అదిరింది..!

98
0
sillyfellows first song

అల్ల‌రి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్లో భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైల‌ర్ 2 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసింది.  హెడ్డేక్ రా లైఫ్ హేడ్డేక్ రా మామ…అంటూ సాగే సాంగ్ ను ఈరోజు ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. శ్రీవ‌సంత్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ పాట‌ను శ్యామ్ కాస‌ర్ల రాయ‌గా, పెంచ‌ల‌దాస్ పాడారు.

లైఫ్ గురించి సిల్లీ ఫెలోస్ ఫ‌న్నీగా పాడుతున్న ఈ పాట క్లాసు, మాసు అనే తేడా లేకుండా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఉంది. ఇక ఈ సాంగ్ ను  స్ర్కీన్ పై చూస్తే ఆడియ‌న్స్ క‌డుపుబ్బా న‌వ్వ‌డం ఖాయం అనిపిస్తోంది. టి.జి విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ చిత్రంలో చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి, రాజార‌వీంద్ర‌, చ‌ల‌ప‌తిరావు, అదుర్స్ ర‌ఘు, ఝాన్సీ, హేమ త‌దిత‌రులు న‌టించారు. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి… ట్రైల‌ర్, సాంగ్ ఆక‌ట్టుకున్న‌ట్టే సిల్లీ ఫెలోస్ సినిమా కూడా అంద‌ర్నీ ఆక‌ట్టుకుని విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here