Home Movie Reviews సిల్లీ ఫెలోస్ రివ్యూ..!

సిల్లీ ఫెలోస్ రివ్యూ..!

417
0
Silly fellows review

అల్ల‌రి న‌రేష్ – సునీల్ కాంబినేష‌న్ లో రూపొందిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సిల్లీ ఫెలోస్ సినిమాని భ‌ర‌త్ చౌద‌రి, కిర‌ణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూ ప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించిన సిల్లీ ఫెలోస్ సినిమా పై అల్ల‌రి న‌రేష్, సునీల్, భీమ‌నేని శ్రీనివాస్ చాలా ఆశ‌లు పెట్టుకున్నారు. టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ రోజు (సెప్టెంబ‌ర్ 7) రిలీజైంది. మ‌రి..సిల్లీ ఫెలోస్ స‌క్స‌స్ సాధించారా.?  లేదా.? అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – జాకెట్ జాన‌కీరామ్ (జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి) జాకెట్లు కుట్టే స్ధాయి నుంచి ఎమ్మెల్యే అవుతాడు. ఇక వీర‌బాబు (లేడీస్ టైల‌ర్). జాన‌కీరామ్ స్పూర్తితో అత‌ను కూడా ఎమ్మెల్యే అవ్వాల‌నుకుంటాడు. త‌ను అనుకున్న‌ది చేయ‌డం కోసం ఎవ‌రినైనా స‌రే వాడేస్తుంటాడు. అలాగే ఓసారి జాకెట్ జాన‌కీరామ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వీర‌బాబు త‌న స్నేహితుడు సూరిబాబు (సునీల్)ని వాడేస్తాడు. దీంతో సూరిబాబు ఓ స‌మ‌స్య‌లో చిక్కుకుంటాడు. ఇదిలా ఉంటే…మినిష్ట‌ర్ గోవ‌ర్ధ‌న్ (శంక‌ర్ మేల్కోటే) అడ్డంగా 500 కోట్లు సంపాదిస్తాడు. చ‌నిపోయే ముందు పుణ్యం గుర్తొచ్చి ఆ 500 కోట్లు ఎక్క‌డ దోచాడో జాకెట్ జాన‌కీరామ్ కి చెప్పి…వాటితో మంచి ప‌నులు చేయ‌మ‌ని చెప్పి చ‌నిపోతాడు. ఈ విష‌యం తెలుసుకున్న భూతం (పోసాని), లంగా బంగారుబాబు (రాజా ర‌వీంద్ర‌) ఆ 500 కోట్లు ఎక్కడో ఉన్నాయో తెలుసుకోవాల‌నుకుంటారు. వీర‌బాబు ఎం.ఎల్.ఎ అయ్యాడా..?  సూరిబాబు స‌మస్య‌ను నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా..?   చివ‌రికి ఆ 500 కోట్లు ఎవ‌రికి ద‌క్కాయి అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ – ఇటీవ‌ల కాలంలో అల్ల‌రి న‌రేష్, సునీల్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఈసారి ఎలాగైనా స‌రే..స‌క్సెస్ సాధించాల‌ని ఎంతో ప‌ట్టుద‌ల‌తో ఈ సినిమా చేసారు. వీర‌బాబుగా అల్ల‌రి న‌రేష్, ఆయ‌న‌ స్నేహితుడు సూరిబాబుగా సునీల్ న‌టించి మెప్పించారు. సినిమా ప్రారంభం నుంచి చివ‌రి వ‌ర‌కు ఆడియ‌న్స్ నవ్వుతూనే ఉండేలా స‌న్నివేశాల‌ను రాసుకుని..ప్రేక్ష‌కుల‌ను  న‌వ్వించారు భీమ‌నేని శ్రీనివాస్. వీర‌బాబు, సూరిబాబే కాకుండా ప్ర‌తి క్యారెక్ట‌ర్ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేసారు. అలాగే హీరోయిన్స్ చిత్ర‌శుక్లా, నందినీరాయ్, పూర్ణ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు న‌టించారు.

ఇక చివ‌రి అర‌గంట‌లో అయితే జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, పోసాని కృష్ణ‌ముర‌ళి పై చిత్రీక‌రించిన స‌న్నివేశాలు హైలైట్ అని చెప్ప‌చ్చు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే..ఉన్న‌వి రెండు పాట‌లే అయిన‌ప్ప‌టికీ పాట‌ల్లో కూడా ఫ‌న్ ఉంది. డైరెక్ట‌ర్ భీమ‌నేని శ్రీనివాస్ ఇంట్రస్టింగ్ స్ర్కీన్ ప్లేతో ఎక్క‌డా బోర్ అనే ఫీలింగ్ లేకుండా ఆద్యంతం ఆస‌క్తిగా ఉండేలా తెర‌కెక్కించారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. బ్ర‌హ్మానందం ఉన్న‌ది కొంచెం సేపే అయినా క‌డుపుబ్బా న‌వ్వించారు. బ్ర‌హ్మి ఈజ్ బ్యాక్ అనేలా ఉంది ఆయ‌న క్యారెక్ట‌ర్.  ఈ సినిమా నిడివి రెండు గంట‌లు మాత్ర‌మే. అందుచేత సినిమా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. గౌతంరాజు ఎడిటింగ్, అనీష్ త‌రుణ్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, శ్రీవ‌సంత్ సంగీతం, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, బ్లూప్లానెట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ నిర్మాణం బాగున్నాయి. టోట‌ల్ గా సిల్లీ ఫెలోస్ గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే…ఫ‌న్ టాస్టిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ సిల్లీ ఫెలోస్.

రేటింగ్ 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here