Home Actor సీఎం జ‌గ‌న్, హీరో సూర్య‌ అనుబంధం వెన‌కున్న అస‌లు క‌థ ఇదే..!

సీఎం జ‌గ‌న్, హీరో సూర్య‌ అనుబంధం వెన‌కున్న అస‌లు క‌థ ఇదే..!

154
0

తమిళ్ తో పాటు తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరో సూర్య. ఆయన నటించిన తాజా చిత్రం ఎన్‌జీకే (నంద గోపాలకృష్ణ). శ్రీరాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా  ప్రిరిలీజ్ ఈవెంట్‌ను సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హైదరాబాద్‌లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ వేడుక‌లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌‌కు సూర్య‌ శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ను తను జగన్ అన్నా అని పిలుస్తానని చెప్పిన సూర్య.. వైఎస్ఆర్సీపీ అధినేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

జగన్ అన్న కజిన్ అనిల్ రెడ్డి తనకు క్లాస్‌మేట్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిన సూర్య..  చెన్నైలో ఐస్‌క్రీంలు తినడం కోసం తామంతా తరచుగా బయటకు వెళ్లే వాళ్లమని చెప్పారు. అనిల్ ద్వారా జగన్ అన్న కుటుంబానికి కూడా తాను దగ్గరయ్యానని తెలిపారు. పదేళ్ల క్రితం జగన్ అన్న కుటుంబానికి, రాష్ట్రానికి తీరని లోటు జరిగింది. పదేళ్ల కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది. అలుపెరగకుండా సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగన్.. ఘన విజయం సాధించారు.

 ఆయన ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి. ప్రజల్లో జగన్ పట్ల ఎంత అభిమానం ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. జగన్ అన్న ఎన్నికల్లో గెలిచారనే వార్త తెలియగానే హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన దేశంలో రెండో పిన్న వయస్కుడైన సీఎం. ఆయన సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నాను అని సూర్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here