Home Political News సీట్ల విష‌యంలో పంతానికి పొవ‌ద్ద‌ని బాబు చెప్ప‌డం హ‌ర్ష‌ణీయం – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్..!

సీట్ల విష‌యంలో పంతానికి పొవ‌ద్ద‌ని బాబు చెప్ప‌డం హ‌ర్ష‌ణీయం – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్..!

94
0

కేసీఆర్ ను ప‌ద‌వి నుంచి దింపేందుకు సీట్ల త్యాగాల‌కు సిద్ద‌మ‌ని… సీట్ల విష‌యంలో పంతానికి పొవ‌ద్ద‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చెప్ప‌డం హ‌ర్ష‌ణీయం అన్నారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్. సీట్ల స‌ర్ధుబాటు విష‌యంలో సీపీఐ, టీజేఏస్‌ కూడా ఆ దిశగా సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. కేసీఆర్‌ ఎంతతిట్టినా చంద్ర‌బాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదని వీహెచ్ గుర్తు చేసారు.

బీసీలకు సీట్ల కోటాయింపుపై ఢిల్లీలో చర్చలకు తనను పిలవలేదని, రాష్ట్రంలో తనకంటే పెద్ద బీసీ నాయకుడు ఎవరున్నారని ప్రశ్నించారు.బీసీ సాధికారత కమిటీ ఏర్పాటు చేసి తప్పు చేశారన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని వీహెచ్‌ స్పష్టం చేశారు.34 సీట్లు బీసీల‌కు కేటాయించాల‌ని కోరుతున్నాం. ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిథిలో రెండు సీట్లు అడుగుతున్నాం అని తెలియ‌చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here